Samantha family members gives clarity on her health
Samantha : స్టార్ హీరోయిన్ సమంత చాలా గ్యాప్ తర్వాత ఇటీవలే యశోద సినిమాతో వచ్చి మంచి విజయం సాధించింది. ఇప్పటికే యశోద సినిమా దాదాపు 40 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. ఇక సమంత మాయోసైటిస్ వ్యాధికి గురైందని, దానికి తగిన చికిత్స తీసుకుంటున్నట్టు తానే స్వయంగా తెలిపింది. దీంతో సమంత కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు.
తాజాగా సమంత ఆరోగ్యంపై తమిళ్ మీడియాలో వార్తలు వచ్చాయి. సమంత తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నట్టు, ఆసుపత్రిలో చేరినట్టు తమిళ మీడియాలో పుకార్లు వచ్చాయి. ఈ వార్తలు సమంత వరకు వెళ్లడంతో సమంత కుటుంబ సభ్యులు, ఆమె మేనేజర్ వీటిపై క్లారిటీ ఇచ్చారు.
Ajay Devgn : రీమేక్స్ తోనే స్టార్ అయి.. అవే రీమేక్స్‌తో కెరీర్‌ని నెట్టుకొస్తున్న స్టార్ హీరో..
సమంత ప్రస్తుతం క్షేమంగానే ఉన్నట్టు, ఇంట్లోనే ఉందని, ఇలాంటి పుకార్లు నమ్మొద్దు అంటూ సమంత కుటుంబ సభ్యులు తెలిపారు. ఇవన్నీ ఫేక్ వార్తలని, సమంతకి ఏమి కాలేదని, ఇలాంటి వార్తలని నమ్మొద్దని సమంత మేనేజర్ తెలిపారు.