Yashoda: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత నటించిన తాజా చిత్రం ‘యశోద’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ టాక్‌ను తెచ్చుకుంది. సమంత ఈ సినిమాను తన భుజాలపై మోసిన తీరు అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు అభిమానులు ఆసక్తిని చూపుతున్నారు. ఇక ఈ సినిమాలోని సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను థ్రిల్ చేయడంలో సక్సెస్ కావడంతో ఈ సినిమాకు రెస్పాన్స్ అదిరిపోయింది.
Yashoda: ఓటీటీని లాక్ చేసుకున్న యశోద.. అప్పుడేనా అంటోన్న ఫ్యాన్స్!
సరోగసీ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ సినిమాలో సమంత ఎలాంటి పాత్రలో నటిస్తుందా అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవెల్లో ఉండటంతో ఈ సినిమాను చూసేందుకు వారు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తొలిరోజే ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో కలెక్షన్లు కూడా బాగా వచ్చాయి. బాక్సాఫీస్ వద్ద ఈ వారం యశోద ఒక్కటే బిగ్ మూవీ కావడంతో ఈ సినిమాను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు.
Yashoda Movie : ‘యశోద’పై సమంత స్పెషల్ ట్వీట్..
ఇక ఫస్ట్ వీకెండ్లో హౌజ్‌ఫుల్ షోలతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేసింది. ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.20 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి తన సత్తా చాటింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా అయినా కూడా స్టార్ హీరోల సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా కలెక్షన్లు సాధిస్తుండటంతో ఈ సినిమా మున్ముందు ఎలాంటి వసూళ్లను రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.