Samantha: ఆ సమయంలో జీవితం కష్టంగా అనిపించింది.. నాగచైతన్యతో విడాకుల విషయంపై స్పందించిన సమంత

సమంత రూత్ ప్రభు ఎట్టకేలకు మాజీ భర్త నాగచైతన్య నుండి విడిపోవటానికి కారణాలను బయటపెట్టారు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత.. నాగచైతన్యతో విడాకుల గురించి మాట్లాడింది. అయితే మా మధ్య విడిపోవటం సామరస్యంగా జరగలేదని తెలిపింది.

Samenta

Samantha: సమంత రూత్ ప్రభు ఎట్టకేలకు మాజీ భర్త నాగచైతన్య నుండి విడిపోవటానికి కారణాలను బయటపెట్టారు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమంత.. నాగచైతన్యతో విడాకుల గురించి మాట్లాడింది. అయితే మా మధ్య విడిపోవటం సామరస్యంగా జరగలేదని తెలిపింది. నాగచైతన్యతో విడిపోయిన తరువాత జీవితం చాలా కష్టం అనిపించిందని అంగీకరించింది. అయితే ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ గా ఉన్నానని, నా పని నేను చేసుకుంటూ పోతున్నానని తెలిపింది. విడాకుల తర్వాత ఇద్దరం ఒకరిపై ఒకరు తీవ్ర మనోవేదనకు గురయ్యామని తెలిపింది.

Samantha: అన్ని ఏరియాలు కవర్ చేస్తోన్న సామ్.. నెక్ట్స్ ఏంటి?

విడాకుల విషయంలో మీరు, మీ భర్త విడిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు.. కారణం మీరే అని నేను అనుకుంటున్నాను అని కరణ్ ప్రశ్నించే క్రమంలో కల్పించుకున్న సమంత ‘మాజీ భర్త’ అనాలి అంటూ తెలిపింది. కరణ్ సారీ చెబుతూ.. మీ మాజీ భర్త, మీరు విడిపోయినప్పుడు మీరే కారణమంటూ ఎక్కువగా ట్రోలింగ్ జరిగిందని మీరు భావించారా అని ప్రశ్నించారు.. సమంత బదులిస్తూ.. “అవును, నేను దాని గురించి ఫిర్యాదు చేయలేను. ఎందుకంటే నేను ప్రశాంతంగా ఉండటానికి ఆ మార్గాన్ని ఎంచుకున్నాను. ఒకవేళ స్పందించాలన్నా ఆ సమయంలో నా దగ్గర సమాధానాలు లేవు అంటూ పేర్కొంది.

Samantha : పెళ్లిళ్లు చెడిపోవడానికి నువ్వే కారణం

నాగచైతన్య నుంచి విడిపోయేటప్పుడు భరణం తీసుకుందని వచ్చిన వార్తపై కూడా సమంత స్పందించింది. తనకు భరణంగా ₹250 కోట్లు వచ్చిందనే పుకార్లు వచ్చాయని, రూ.250 కోట్లు తీసుకుందని అనడం ఎంత పెద్ద అబద్ధమో మీడియా గ్రహించినప్పుడు పుకార్లు వాటంతట అవే ఆగిపోయాయని తెలిపింది. గత ఏడాది అక్టోబర్‌లో సమంత, చైతన్య తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా విడిపోతున్నట్లు ప్రకటించారు. నాగ చైతన్య, సమంత దాదాపు నాలుగేళ్ల వివాహబంధాన్ని ముగించుకున్న సందర్భంగా అక్టోబర్ 2న ఓ ప్రకటన విడుదల చేశారు. అయితే ఇప్పటి వరకు వారు ఏ వేదికపైన ఈ విషయం మాట్లాడలేదు. తాజాగా సమంత వారిద్దరి విడాకుల అంశంపై స్పందించింది.