Samantha Yashoda First Day Collections
Samantha : సమంత చాలా గ్యాప్ తర్వాత ఫుల్ లెంగ్త్ సినిమాతో వచ్చింది. ‘యశోద’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో నవంబర్ 11న ప్రేక్షకులని పలకరించింది. తమిళ డైరెక్టర్స్ హరి-హరీష్ దర్శకత్వంలో సమంత మెయిన్ లీడ్ లో శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ యశోద సినిమాని తెరకెక్కించారు. యశోద సినిమా పాన్ ఇండియా వైడ్ గా రిలీజయింది.
యశోద సినిమా మొదటి రోజు మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. థ్రిల్లింగ్, ట్విస్టులతో పాటు సమంత పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని చెప్తున్నారు సినిమా చూసిన వాళ్ళు. యశోద సినిమాకి ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 12 కోట్లకి, హిందీలో 3 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 1 కోటి రూపాయలకి, ఓవర్సీస్ 2.5 కోట్లకి థియేట్రికల్ హక్కులు అమ్ముడయ్యాయి. మొత్తంగా దాదాపు 18.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ యశోద సినిమాకి జరిగింది. యశోద సినిమా హిట్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాల్సిందే. సమంత ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాకి ఈ రేంజ్ లో బిజినెస్ జరిగిందంటే చాలా ఎక్కువే అని చెప్పొచ్చు.
Kannada Heroins : టాలీవుడ్ కి క్యూ కడుతున్న కొత్త కన్నడ భామలు..
అయితే మొదటి రోజు సమంత పర్వాలేదనిపించింది. మొదటి రోజు సమంత యశోద సినిమా ప్రపంచవ్యాప్తంగా 6.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని రాబట్టింది. దాదాపు 3 కోట్ల షేర్ కలెక్షన్స్ ని రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 1.7 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ వచ్చాయి యశోద సినిమాకి. ఇటీవల కాలంలో ఒక ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాకి ఈ కలెక్షన్స్ ఎక్కువనే చెప్పొచ్చు. అయితే సినిమాని ఎక్కువగా ప్రమోట్ చేయకపోవడం వల్ల కలెక్షన్స్ తగ్గాయని భావిస్తున్నారు. ఈ వీకెండ్ రెండు రోజులు అయిపోయేలోపు ఈజీగా 10 కోట్ల షేర్ కలెక్షన్స్ దాటేస్తుందని భావిస్తున్నారు. సినిమా టాక్ బాగుండటం, ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏమి లేకపోవడం సమంత యశోద సినిమాకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.
The Riveting Action-packed emotion of our #Yashoda gets 6.32CR Gross WORLDWIDE on DAY 1?
Don't miss the thrill ?https://t.co/GtLWiMBXNM@Samanthaprabhu2 @varusarath5 @Iamunnimukundan @harishankaroffi @hareeshnarayan @krishnasivalenk @SrideviMovieOff pic.twitter.com/Wp2P4MWPgg
— Sridevi Movies (@SrideviMovieOff) November 12, 2022