Meta India Head: మెటా ఇండియా హెడ్‌గా సంధ్యా దేవ‌నాథ‌న్

2016 నుంచి సంధ్యా దేవ‌నాథ‌న్ మెటాలో ప‌నిచేస్తున్నారు. 2020 నుంచి ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) మార్కెట్‌లో కంపెనీ గేమింగ్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. 2023 జనవరి1న కొత్త బాధ్యతలు స్వీకరించడానికి భారతదేశానికి తిరిగి రానున్నారు.

Meta India Head

Meta India Head: ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా ఇండియా హెడ్‌గా సంధ్యా దేవనాథన్‌ను నియమించింది. మెటా వైస్ ప్రెసిడెంట్‌గాకూడా ఆమె బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మెటా ఇండియా హెడ్‌గా కొనసాగుతున్న అభిజిత్ బోస్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మెటా యాజమాన్యం ఇండియా హెడ్ గా సంధ్యా దేవనాథ్ ను ఆ సంస్థ నియమించింది.

WhatsApp and Meta: వాట్సాప్, మెటా సంస్థల కీలక ఉద్యోగులు రాజీనామా.. ఇద్దరూ భారతీయులే

2016 నుంచి సంధ్యా దేవ‌నాథ‌న్ మెటాలో ప‌నిచేస్తున్నారు. 2020 నుంచి ఆసియా పసిఫిక్ (ఏపీఏసీ) మార్కెట్‌లో కంపెనీ గేమింగ్ వ్యాపారానికి నాయకత్వం వహిస్తున్నారు. 2023 జనవరి1న కొత్త బాధ్యతలు స్వీకరించడానికి భారతదేశానికి తిరిగి రానున్నారు. ఫేస్‌బుక్‌పై ప్ర‌స్తుతం ఇండియాలో రెగ్యులేట‌రీ స‌మ‌స్య‌లు ఉన్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం క‌ఠిన ఆంక్ష‌లు విధిస్తున్న త‌రుణంలో సంధ్యా దేవ‌నాథ‌న్ నియామ‌కం కీల‌కంకానున్న‌ది. ఫేక్ న్యూస్‌, విద్వేష ప్ర‌సంగాల‌ను అరిక‌ట్ట‌డంలో ఫేస్‌బుక్ విఫ‌ల‌మైంది.

Metas Layoff: తెల్లారేలోపే ఉద్యోగాలు తీసేసిన ‘మెటా’.. సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్న ఉద్యోగులు

సంధ్య నియామకంపై మెటా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మార్నే లెవిన్ మాట్లాడుతూ.. భారతదేశానికి కొత్త నాయకురాలిగా సంధ్యను స్వాగతిస్తున్నామన్నారు. సంధ్య వ్యాపారాలను స్కేలింగ్ చేయడం, అందరిని కలుపుకొని వెళ్తూ ఉత్పత్తి ఆవిష్కరణలను నడపడం, బలమైన భాగస్వామ్యాలను నిర్మించడంలో ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉంది. భారతదేశంలో మెటా యొక్క నిరంతర వృద్ధికి ఆమె నాయకత్వం వహిస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము అన్నారు.