Pongal in AP: వేటపాలెంలో అలరిస్తున్న పడవల పోటీలు

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో పడవ పోటీలు నిర్వహించారు. పొట్టిసుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో మత్స్యకారులకు పడవ పోటీలు నిర్వహించారు.

Pongal in AP: సంక్రాంతి అంటే తెలుగు వారి పండుగ. ఊరూవాడా ఏకమై అందరు సందడిగా చేసుకునే పండుగ సంక్రాంతి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎంతో సందడిగా సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. పండుగ సందర్భంగా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో కోడి పందాలు, ఎడ్ల పోటీలు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెంలో పడవ పోటీలు నిర్వహించారు. శనివారం పొట్టిసుబ్బయ్యపాలెం సముద్ర తీరంలో మత్స్యకారులకు పడవ పోటీలు నిర్వహించారు. వేటపాలెం చీరాల బాపట్ల మండలాలకు చెందిన 30 మంది మత్యకారులును మూడు విభాగాలుగా విభజించి పోటీలు నిర్వహించారు. మత్స్యకారులకు చెందిన నాటు పడవల్లోనే ఈ పోటీలు నిర్వహించారు.

Also read: Balayya Sankranthi: కారంచేడులో బాలయ్య సంక్రాంతి సంబరాలు

సముద్రంలో కిలో మీటర్ దూరంలో ఉన్న మరో పడవలో ఉన్న ఎర్రజెండాను ముందుగా తీసుకువచ్చిన వారిని విజేతలుగా ప్రకటిస్తారు. మొత్తం పోటీలో పాల్గొన్న వారిలో మూడు విభాగాల్లో మూడు చొప్పున గెలిచిన బృందాలను ఎంపికచేసి సెమి ఫైనల్ కు పంపిస్తారు. మొత్తం తొమ్మిది బృందాలకు సెమిఫైనల్లో మూడు విభాగాల్లో ముగ్గురు విజేతలను ఎంపిక చేసి వారికీ ఫైనల్ నిర్వహిస్తారు. పడవ పోటీలో గెలిచిన వారికీ మొదటి బహుమతిగా రూ.10 వేలు, రెండో బహుమతిగా రూ.7 వేలు, మూడవ బహుమతిగా రూ.5 వేలు ఫ్రైజ్ మనినీ విజేతలకు అందించనున్నారు. ఇక పడవ పోటీలను తిలకించేందుకు మూడు మండలాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భారీగా వచ్చిన జనసందోహంతో సముద్ర తీరం కిటకిటలాడింది.

Also read: Indian Govt.: విదేశీ హెలికాప్టర్, క్షిపణి దిగుమతి ఒప్పందాలను రద్దు చేసిన కేంద్రం

ట్రెండింగ్ వార్తలు