Sardar movie producer gifted a car to director PS Mithran
PS Mithran : కార్తీ డ్యూయల్ రోల్ లో రాశీ ఖన్నా, రజిషా విజయన్ హీరోయిన్లుగా దీపావళికి వచ్చిన సినిమా ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ ఈ సినిమాని తెరకెక్కించాడు. వాటర్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా దీపావళి కానుకగా రిలీజయి తెలుగు, తమిళ్ లో భారీ విజయం సాధించింది.
ఇటీవల సినిమా హిట్ అయితే డైరెక్టర్స్ కి హీరోలు లేదా నిర్మాతలు ఏదో ఒక ఖరీదైన గిఫ్టులు అందిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ పరిశ్రమలలో ఇది కొనసాగుతోంది.
తాజాగా సర్దార్ సినిమా మంచి విజయం సాధించి కలెక్షన్స్ రావడంతో చిత్ర నిర్మాత, ప్రిన్స్ పిక్చర్స్ అధినేత ఎస్. లక్ష్మణ్ డైరెక్టర్ పీఎస్ మిత్రన్ కి ఖరీదైన టయోటా కారుని గిఫ్ట్ గా ఇచ్చారు. హీరో కార్తీ చేతుల మీదుగా కారుని పీఎస్ మిత్రన్‌కు అందించాడు. ఈ కారు ధర దాదాపు రూ.30 లక్షలపైనే ఉంటుందని సమాచారం. కార్తీ పీఎస్ మిత్రన్ కి కారు కీ అందిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Producer @lakku76 presented a brand new car to Director @Psmithran following the huge success of #Sardar ?
Actor @Karthi_Offl handed over the key to #PSMithran@Prince_Pictures @RedGiantMovies_ @gvprakash @george_dop @ChunkyThePanday @SonyMusicSouth @johnsoncinepro @decoffl pic.twitter.com/h5Fga4kUj3
— Ramesh Bala (@rameshlaus) November 2, 2022