Seema,Sachin Love story : సీమా, సచిన్‌లకు అస్వస్థత…భారత పౌరసత్వం కల్పించాలని రాష్ట్రపతికి లేఖ

ప్రేమ జంట సీమా హైదర్, సచిన్ మీనాలిద్దరూ శనివారం అస్వస్థతకు గురయ్యారు. పాకిస్థాన్ దేశం నుంచి ప్రేమికుడి కోసం సరిహద్దులు దాటి వచ్చిన సీమా హైదర్ బాగోతంపై ఉత్తరప్రదేశ్ యాంటి టెర్రిరస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు దర్యాప్తు సాగిస్తున్నాయి...

Seema,Sachin Love story : ప్రేమ జంట సీమా హైదర్, సచిన్ మీనాలిద్దరూ శనివారం అస్వస్థతకు గురయ్యారు. పాకిస్థాన్ దేశం నుంచి ప్రేమికుడి కోసం సరిహద్దులు దాటి వచ్చిన సీమా హైదర్ బాగోతంపై ఉత్తరప్రదేశ్ యాంటి టెర్రిరస్ట్ స్క్వాడ్, ఇంటెలిజెన్స్ బ్యూరోలు దర్యాప్తు సాగిస్తున్న నేపథ్యంలో ఈ ప్రేమజంట అస్వస్థతకు గురవడంతో వారికి వైద్యులు చికిత్స అందించారు. (medical assistance after both fall sick)

ముమ్మర దర్యాప్తు

సరిహద్దులు దాటి వచ్చిన పాకిస్థాన్ జాతీయురాలైన సీమాకు పాక్ ఐఎస్ఐతో సంబంధాలున్నాయనే అనుమానంతో భారత దర్యాప్తు సంస్థలు ఆరా తీస్తున్నాయి. రబుపురా ప్రాంతంలో తన భర్త సచిన్ మీనాతో కలిసి నివాసం ఉంటున్న సీమా తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లకు లేఖలు రాశారు.

ప్రధాని, రాష్ట్రపతి, సీఎంలకు లేఖలు

భారత పౌరసత్వం కోరుతూ సీమా హైదర్ శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మూకు పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు న్యాయవాది ఏపీ సింగ్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్‌లో సీమా హైదర్ తన భర్త ఇంట్లో నివసించడానికి అనుమతించాలని కోరింది. సీమా హైదర్, సచిన్ మీనా పెళ్లి రోజు నాటి ఫోటోలు తాజాగా బయటకు వచ్చాయి. అందులో ఒక ఫోటోలో సీమా సచిన్ కు పాదాభివందనం చేశారు.

భారత పౌరసత్వం కల్పించండి

తనకు భారత పౌరసత్వం కల్పించాలని సీమాహైదర్ విజ్ఞప్తి చేశారు. దరఖాస్తులో సీమా సచిన్ మీనాతో తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను జత చేశారు. ఫోటోల్లో సీమా, సచిన్ ఒకరినొకరు పూలమాలలు వేసుకున్నట్లు చూపిస్తున్నాయి. ఈ ఫొటోల్లో సీమా చీరలో, సచిన్ సూట్‌లో కనిపించారు. మరోవైపు సీమా హైదర్‌ కేసులో ఉత్తరప్రదేశ్‌లోని యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (యూపీ ఏటీఎస్), కేంద్ర ఏజెన్సీలు తమ దర్యాప్తును ముమ్మరం చేశాయి.

ట్రెండింగ్ వార్తలు