Eknath Shinde..maharashtra's Politics
Maharashtra: మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు జరుపుతోన్న శివసేన రెబల్ నేత, మంత్రి ఏక్‌నాథ్ షిండే గుజరాత్‌లోని వడోదరలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో గత అర్ధరాత్రి సమావేశమయ్యారు. మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశంపైనే ఆయన చర్చించినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా కూడా వడోదరలోనే ఉండడం గమనార్హం. ఆయన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారా? అన్న విషయంపై స్పష్టత లేదు.
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కొవిడ్ పాజిటివ్
గత రాత్రి ఏక్‌నాథ్ షిండే అసోంలోని గువాహటి నుంచి వడోదరకు ప్రత్యేక విమానంలో వెళ్లారు. దేవేంద్ర ఫడ్నవీస్‌తో చర్చలు జరిపిన అనంతరం విమానంలో వెంటనే తిరిగి గువాహటిలోని హోటల్‌కు ఏక్‌నాథ్ షిండే తిరిగి వెళ్లారు. హోటల్‌లో షిండేతో పాటు దాదాపు 40 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే షిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలకు మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ నోటీసులు పంపారు. సోమవారంలోపు సమాధానం చెప్పాలని, అలాగే, ముంబైకి రావాలని ఆదేశించారు. కాగా, ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటుతో సీఎం ఉద్ధవ్ ఠాక్రే సర్కారు పతనం అంచున ఉంది.