ఓరి నాయనో….మైనస్ 39 డిగ్రీల చలి​లో బికినీ పార్టీ..చిందులే చిందులు

Serbia: bikini party 39 degrees celsius in Toms City : శీతాకాలం చలితో వణికిపోతున్నాం. అదే మైనస్ డిగ్రీల వాతావరణంలో ఉంటే ఇక చెప్పేదేముంది? కాళ్లు చేతులు వణకటమే. అటువంటిది ఏకంగా 39 డిగ్రీల సెల్సియస్ చలిలో పార్టీ చేసుకుంటే ఎలా ఉంటుంది. అందునా అది బికినీ పార్టీ అయితే..ఇక మంచు బొమ్మల్లాగ గడ్డకట్టుకుపోవటం ఖాయంకదూ..కానీ అటువంటి చలిలో కొంతమంది బికినీ పార్టీ చేసుకుంటూ చిందులే చిందులేశారు.

మైనస్ 39 డిగ్రీలంటే ఎన్ని స్వెటర్లు వేసుకుంటే చలి ఆగుతుంది చెప్పండి. అటువంటిది ఏకంగా సెర్బియాలో మైనస్ 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో బికినీ పార్టీ చేసుకున్నారు. రక్తం గడ్డ కట్టే చలిలో సగం, సగం దుస్తులతో చిందులు వేశారు. ఒంటిమీద దుస్తులు ఉన్నాయా లేవా అన్నట్లుగా బికినీలు వేసుకుని చలికి వణికిపోతూ పార్టీ తెగ ఎంజాయ్ చేశారు కొంతమంది యువత.

సెర్బియాలోని టోమ్స్ నగరంలో ఈ బికినీ పార్టీ జరిగింది. వేసవిదాకా ఆగలేని అక్కడి యువకులు ఈ బికినీ పార్టీ చేసుకుంటూ తెగ చిందులేశారు. పదుల సంఖ్యలో యువతీ, యువకులు బికినీలు, కల్ ఫుల్ స్విమ్ సూట్లు వేసుకొని డ్యాన్స్ చేశారు. మొత్తంలో మంచుతో నిండిపోయిన సెంట్రల్ స్వ్కైర్​లో న్యూ ఇయర్ కోసం వేసిన డెకరేషన్ ముందు..ఓ యువకుడి బర్త్ డే కోసం ఈ యువత చిందేశారు.

పార్టీలో చిందులేసేవారి నోళ్లల్లోంచి గుప్పు గుప్పుమంటూ పొగతాగేవారి మాదిరిగా వారి నోళ్లలో నుంచి పొగలను చూస్తుంటే అర్థమవుతుంది అక్కడ ఎంత చలిగా ఉందో. ఈ పార్టీ జరిగిన సమయంలో టోమ్క్ నగరంలో మైనస్ 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ బికీనీ పార్టీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు మీ దుంపలు తెగ..చచ్చే చలిలో ఈ చిందులేంట్రా అంటున్నారు. మరికొందరేమో పార్టీ అయినంత సేపు చిందులు బాగానే వేస్తారు…ఆ తరువాత బహుశా వారికి అంబులెన్స్ అవసరం ఉంటుందేమో నంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఇంకొందరు ఇది మరీ ఓవర్ అంటున్నారు.