Navya Swamy
Navya Swamy: సెలబ్రిటీలు ఏం చేసినా ఇట్టే హాట్ టాపిక్ అయిపోద్ది. వాళ్ళ చుట్టూ కోట్లాది కళ్ళు వెంటాడుతుంటాయి కాబట్టి వాళ్ళ కదలికలు బహిర్గతం అయిపోతుంటాయి. అసలే సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు అసలు ఉందో లేదో తెలియకుండానే తెగ వైరల్ అయిపోతుంటాయి. సీరియల్ హీరోయిన్ నవ్యస్వామి విషయంలో కూడా ఇప్పుడు ఇదే పరిస్థితి. సీరియల్స్ హీరోలతో సమానంగా క్రేజ్ దక్కించుకొని ఈ కన్నడ భామ ఇప్పుడు సీరియల్ హీరోతోనే ప్రేమాయణంలో ఉందని ఇంటర్నెట్ కోడైకూస్తుంది.
నా పేరు మీనాక్షి అనే సీరియల్‌తో తెలుగులో ఫాలోయింగ్ పెంచుకున్న నవ్య కన్నడ, తమిళంలో పలు సీరియల్స్‌తో బిజీబిజీగా ఉంది. సీరియల్స్ తో ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటుంది. ఇక నవ్య ప్రేమలో ఉండనే వార్తలకు కూడా కొదువేలేదు. ఆమె కథ సీరియల్ సహ నటుడు రవికృష్ణతో నవ్య ప్రేమలో ఉందంటూ కొద్ది రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అయితే.. నవ్య మాత్రం పలు ఇంటర్వ్యూలో అవి వట్టి పుకార్తేనని కొట్టిపారేసింది.
కానీ.. ఈ ఇద్దరూ ఒకరి పోస్టులకు మరొకరు ఇచ్చే రెస్పాన్స్ మాత్రం సమ్ థింగ్ ఏదో జరుగుతుందనే అనుమానాలు మాత్రం ఆగలేదు. తాజాగా.. ఓ నెటిజన్.. నవ్య స్వామి గతంలో అవిష్ గౌడ్ అనే వ్యక్తితో రిలేషన్‌లో ఉండగా.. ఇప్పుడు అతడితో విడిపోయాక ఇప్పుడు రవికృష్ణతో ప్రేమయాణం సాగిస్తుంది అంటూ కామెంట్ చేశాడు. అంతే.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ప్రేమాయణం హాట్ టాపిక్‌గా మారింది.