Mannat : వజ్రాలతో ఇంటిముందు నేమ్ ప్లేట్ పెట్టించిన షారుఖ్.. నేమ్ ప్లేట్ కోసం ఇంత ఖర్చా??
ముంబైలో విజిటింగ్ ప్లేసెస్ లో షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా ఒకటి. భారీగా ఖర్చుపెట్టి తనకి నచ్చినట్టు గ్రాండ్ గా షారుఖ్ తన ఇంటిని నిర్మించుకున్నాడు. షారుఖ్ ఇంటికి మన్నత్ అని పేరు పెట్టుకున్నాడు. మన్నత్ కూడా ముంబైలో ఫేమస్ ప్లేస్ అయిపోయింది. చాలా మంది..............
- Saketh U
- Published On : November 22, 2022 / 08:34 AM IST
Shah Rukh put a name plate in front of the house with diamonds.
Mannat : ముంబైలో విజిటింగ్ ప్లేసెస్ లో షారుఖ్ ఖాన్ ఇల్లు కూడా ఒకటి. భారీగా ఖర్చుపెట్టి తనకి నచ్చినట్టు గ్రాండ్ గా షారుఖ్ తన ఇంటిని నిర్మించుకున్నాడు. షారుఖ్ ఇంటికి మన్నత్ అని పేరు పెట్టుకున్నాడు. మన్నత్ కూడా ముంబైలో ఫేమస్ ప్లేస్ అయిపోయింది. చాలా మంది అభిమానులతో పాటు, ముంబై చూడటానికి వచ్చిన వాళ్ళు షారుఖ్ ఇంటిని కూడా చూసి వెళ్తారు.
అయితే ఈ మన్నత్ కి మరింత గ్రాండియర్ తీసుకురావడానికి గతంలో వజ్రాలతో ఉన్న నేమ్ ప్లేట్ ని చేపించారు షారుఖ్. వజ్రాలతో ఉండే ప్లేట్ పై మన్నత్ అని రాసి ఉంటుంది. దీనిని ఇంటి ముందు అమర్చారు. దీంతో నేమ్ ప్లేట్ కోసం వజ్రాలతో చేయించాలా అని అంతా ఆశ్చర్యపోయారు. అయితే సెక్యూరిటీ కారణాల వల్ల గతంలో ఆ వజ్రాల నేమ్ ప్లేట్ ని తీసేశారు.
Deepthi Ganta : నా తమ్ముడ్ని హీరోగా పెట్టి మంచి లవ్‌స్టోరీతో సినిమా తీస్తాను..
తాజాగా మరోసారి షారుఖ్ తన ఇంటికి వజ్రాల నేమ్ ప్లేట్ పెట్టించారు షారుఖ్. దాదాపు 35 లక్షల విలువ చేసే వజ్రాల ముక్కలతో నేమ్ ప్లేట్ తయారు చేయించి దానిపై మన్నత్ అని రాపించి ఇంటిముందు పెట్టాడు షారుఖ్. రాత్రిపూట ఆ వజ్రాలు మెరుస్తూ ఆ ఇంటికి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. దీంతో ఆ వజ్రాల నేమ్ ప్లేట్ ని చూడటానికి మరోసారి ప్రజలు షారుఖ్ ఇంటికి క్యూ కడుతున్నారు. ఇక కొంతమంది అయితే ఎంత డబ్బు ఉంటే మాత్రం వజ్రాలతో నేమ్ ప్లేట్ చేయించి ఇంటి బయట పెట్టాలా అని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం షారుఖ్ ఇంటి వజ్రాల నేమ్ ప్లేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Here is that precious lovely diamond name plates at #Mannat with the new Gate.?
RT if you cant wait to take a selfie ? soon with this new name plate on our King’s palace #Mannat #ShahRukhKhan? @iamsrk pic.twitter.com/LG60SuGjMN
— ♡♔SRKCFC♔♡™ (@SRKCHENNAIFC) November 20, 2022
