Bike Stunt: బైకుపై శక్తిమాన్ స్టంట్లు.. యువకుడి అరెస్టు
సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం బైకులు, కార్లపై ప్రాణాపాయ స్టంట్లు చేయడం ఈ మధ్య చాలామందికి ట్రెండుగా మారింది. అలా స్టంట్లు చేసిన వాళ్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలూ ఉంటున్నాయి. ఇంకొన్నిసార్లు జైలు పాలవ్వాల్సి వస్తుంది కూడా.
- Narender Thiru
- Published On : May 28, 2022 / 05:49 PM IST
Bike Stunt
Bike Stunt: సోషల్ మీడియాలో లైకులు, ఫాలోవర్ల కోసం బైకులు, కార్లపై ప్రాణాపాయ స్టంట్లు చేయడం ఈ మధ్య చాలామందికి ట్రెండుగా మారింది. అలా స్టంట్లు చేసిన వాళ్లు ప్రమాదాలకు గురవుతున్న ఘటనలూ ఉంటున్నాయి. ఇంకొన్నిసార్లు జైలు పాలవ్వాల్సి వస్తుంది కూడా. అయినా, కొందరు మారడం లేదు. తాజాగా ఇలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఉద్దేశంతో బైకుపై స్టంట్ చేసి అరెస్టయ్యాడో యువకుడు.
Bihar girl: పవర్ ఆఫ్ సోషల్ మీడియా.. బిహారీ బాలికకు కృత్రిమ కాలు
నోయిడాకు చెందిన వికాస్ అనే యువకుడు ఇటీవల బైకు నడుపుతూ, దానిపై శక్తిమాన్‌లా పడుకున్నాడు. పైగా దీన్ని తన స్నేహితులతో వీడియో తీయించుకున్నాడు. ఆ తర్వాత సోషల్ మీడియాలో పెట్టారు. తర్వాత ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ వీడియోపై పోలీసులు దృష్టి సారించారు. ఇలా బైకు నడపడం నిబంధనలకు విరుద్ధం. పైగా ప్రాణాపాయం. ఈ నేపథ్యంలో బైకుపై స్టంట్లు చేసిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బైకు నడిపిన వికాస్‌తోపాటు, వీడియో తీసిన మరో ఇద్దరు స్నేహితులపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఈ స్టంటు కోసం వాడిన బైకును స్వాధీనం చేసుకున్నారు.
Ram Nath Kovind: యోగాను ఒక మతానికి పరిమితం చేయడం సరికాదు: రామ్‌నాథ్ కోవింద్
ఇటీవల ఒక యువకుడు రెండు కార్లపై నిలబడి వీడియో తీసుకోగా, అతడ్ని కూడా పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో కూడా నోయిడాలోనే తీయడం మరో విశేషం. తాజాగా బైకు స్టంటు విషయంలో అరెస్టైన ముగ్గురు యువకులు జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు.
बाइक पर खतरनाक स्टंट करने वाले युवक विकास तथा वीडियो बनाने वाले उसके 02 साथियों (गौरव, सूरज) को थाना सेक्टर-63 नोएडा पुलिस द्वारा गिरफ्तार कर स्टंट में प्रयुक्त बाइक को सीज किया गया।#UPPolice pic.twitter.com/d94nvcfK01
— POLICE COMMISSIONERATE GAUTAM BUDDH NAGAR (@noidapolice) May 28, 2022
