Raj Kundra Case : అన్ని సమయాల్లో మీతోనే.. శిల్పాకు బాసటగా షమితా
నీలిచిత్రాల కేసులో అరెస్టైన కేసులో రాజ్ కుంద్రా భార్య శిల్పా శెట్టిని తాజాగా పోలీసులు విచారించిన విషయం తెలిసిందే.. ఈ విచారణ సమయంలో మీడియాలో ప్రసారమైన కథనాలపై ఆమె నోచుకున్నారు. ఈ సందర్బంగా భావోద్వేగంతో కూడిన రెండో పేజీల లేఖను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ లేఖలో శిల్పా చేసిన వ్యాఖ్యలకు ఆమె సోదరి షమితా మద్దతు నిలిచారు.
- kunduru Vinod
- Published On : August 3, 2021 / 09:10 PM IST
Raj Kundra Case
Raj Kundra Case : నీలి చిత్రాల చిత్రీకరణ కేసులో రాజ్ కుంద్రా అరెస్టైన విషయం తెలిసిందే.. ఈ కేసులో తాజాగా శిల్పా శెట్టిని విచారించారు పోలీసులు. ఈ సమయంలో తనపై మీడియాలో వచ్చిన వార్తలకు శిల్పా అసహనం వ్యక్తం చేశారు. ఈ కేసులో మీడియా తన విచారణను నిలిపివేయాలని శిల్పా శెట్టి ఒక ప్రకటనను విడుదల చేశారు. పిల్లల కోసం తన కుటుంబ గోప్యతను గౌరవించాలని శిల్పా సోషల్ మీడియాలో రెండు పేజీల సుదీర్ఘ ప్రకటనను షేర్ చేశారు.
తనకు చట్టంపై పూర్తి నమ్మకం ఉన్నదని, తనపై మీడియా విచారణను నిలిపివేయాలని ఆమె కోరారు. శిల్పా ప్రకటన అనంతరం పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆమెకు మద్దతు నిలిచారు. ఇక ఈ నేపథ్యంలోనే శిల్పా చెల్లెలు షమితా శెట్టి అక్కకు బాసటగా నిలిచింది. ‘ఐ లవ్ యు. ప్రతి మంచి, చెడు సమయంలో నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను’ అంటూ సోషల్ మీడియాలో రాశారు షమితా.
మరో నటుడు ఆర్ మాధవన్ కూడా శిల్పాకు మద్దతుగా నిలిచి నాకు తెలిసిన బలమైన వ్యక్తులలో మీరు ఒకరు. మీరు ఈ సవాలును గౌరవంగా అధిగమిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను’ అని రాశారు.
