Brahmamgari Matham: మఠం ఫిట్ పర్సన్ గా శంకర్ బాలాజీ బాధ్యతల స్వీకరణ

కాలజ్ఞాని బ్రహ్మంగారి మఠం వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. ఇటు ప్రభుత్వం.. అటు పలువురు పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారు. ఈలోగా మఠం కార్యకలాపాలు ఆగకుండా ఉండేలా కడప దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని ఫిట్ పర్సన్ గా ప్రభుత్వం నియమించింది.

Brahmamgari Matham: కాలజ్ఞాని బ్రహ్మంగారి మఠం వివాదం ఇంకా కొలిక్కిరాలేదు. ఇటు ప్రభుత్వం.. అటు పలువురు పీఠాధిపతులు బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎంపికపై చర్చలు, సంప్రదింపులు జరుపుతున్నారు. ఈలోగా మఠం కార్యకలాపాలు ఆగకుండా ఉండేలా కడప దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శంకర్ బాలాజీని ఫిట్ పర్సన్ గా ప్రభుత్వం నియమించింది. బాలాజీ సోమవారం ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన శంకర్ బాలాజీ రేపటినుండి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులకు దైవదర్శనానికి అవకాశము కల్పిస్తామని చెప్పారు. బ్రహ్మంగారిమఠం పవిత్రతను కాపాడుతూ ఆస్తుల పరిరక్షణకు కృషి చేస్తామని.. అవినీతి అక్రమాలపై రికార్డులను పరిశీలించి పూర్తిస్థాయి విచారణ చేపడతామన్నారు. బ్రహ్మంగారిమఠంలో అవినీతి ఆరోపణలపై విచారణ చేపట్టి ఎంతటివారి పైనైనా కటిన చర్యలు చేపడతామని.. కమిషనర్ గారిని బ్రహ్మంగారి మఠానికి రప్పించి అభివృద్ధి పనులు వేగవంతం అయ్యేలా కృషి చేస్తానని చెప్పారు.

త్వరలోనే ప్రభుత్వం బ్రహ్మంగారి మఠం పీఠాధిపతిని నియమిస్తుందని.. రెండు రోజుల్లో బ్రహ్మంగారిమఠం ఆలయ ఉద్యోగులకు రావాల్సిన జీతభత్యాలను చెల్లిస్తామని.. బ్రహ్మంగారిమఠం ఆలయ అభివృద్ధికి పరిరక్షణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు