శివసైనికుల అరాచకం….బీజేపీ నేతపై ఇంకుపోసి, చీరకట్టి, చెప్పులదండ, వేసి ఊరేగించారు

Shiv Sena workers allegedly pour black ink on a BJP leader : మహారాష్ట్రలో శివసైనికులు రెచ్చిపోయారు. ముఖ్యమంత్రి ఉధ్ధవ్ ఠాక్రే ను విమర్శించిన వ్యక్తిపై ఇంకు చల్లి, చీరకట్టి, చెప్పుల దండవేసి ఊరేగించి పిడిగుద్దులతో దాడి చేసి అరాచకం సృష్టించారు.

మహారాష్ట్రలోని పండరీపూర్ లోబీజేపీ నేత శిరీష్ కాటేకర్ సీఎం ఉధ్ధవ్ ఠాక్రే పై విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు ఆయనపై ఇంకు చల్లి పిడిగుద్దులతో దాడి చేశారు. ఇంతటితో ఆగకుండా ఆయనకు చీరకట్టి ఊరేగించారు. పోలీసులు అడ్డుకుంటున్నా శివసైనికులు శిరీష్ కాటేకర్ పై దాడి చేస్తూ ఆయనకు చీరకట్టారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడీయో పై కేసు నమోదు కావటంతో పోలీసులు 17 మంది నిందితులను అరెస్ట్ చేశారు.