Bride, groom ugly fight : వేదికపై తన్నుకున్న పెళ్లికొడుకు-పెళ్లికూతురు.. షాకైన అతిథులు

పెళ్లి చేసుకున్న కొత్త జంట సంతోషంలో ఉంటారు. కొత్తగా మొదలుపెట్టబోతున్న జీవితం గురించి కలలు కంటారు. కానీ ఇప్పుడు కొన్ని పెళ్లిళ్లు పెళ్లిరోజే పెటాకులు అవుతున్నాయి. వేదికపైనే కొట్టుకున్న ఓ జంట వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Bride, groom ugly fight

Viral Video : పెళ్లి జరగాల్సిన వేదికపై పెళ్లికూతురు, పెళ్లికొడుకు చితక్కొట్టుకున్నారు. ఇదేం విచిత్రం అంటారా? అవును నిజం. ఇక వారు కలిసి జీవితం ఏం పంచుకుంటారని పెళ్లికి వచ్చినవారు షాకయ్యారు.

Story of mother and son : తల్లి ఇష్టాన్ని నెరవేర్చిన కొడుకు.. ట్విట్టర్‌లో వైరల్ అవుతున్న ఆయుష్ గోయల్ కథ..

సోషల్ మీడియాలో చిత్ర విచిత్రాలు చూస్తున్నాం. ఇంచుమించుగా సినిమా సీన్లను తలపిస్తున్నాయి. వేదికపై పెళ్లికొడుకు వెయిట్ చేస్తుంటే బ్యూటీపార్లర్ నుంచి పెళ్లికూతురు ప్రియుడితో పారిపోవడం.. వర్షంలో ఆగని పెళ్లి.. వధూవరుల మెస్మరైజింగ్ డ్యాన్స్.. ఇలా రకరకాల వీడియోలు కనిపిస్తూనే ఉన్నాయి. bridal_lehenga_designn అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో పెళ్లికూతురు పెళ్లికొడుకు భయంకరంగా తన్నుకున్నారు. వేదికపై ఇద్దరి మధ్య ఏ విషయం గొడవకు కారణమైందో తెలియదు కానీ ఇరువర్గాల వారు విడదీయడానికి ప్రయత్నించినా వారు తన్నుడు మాత్రం ఆపలేదు. కారణం ఏదైనా ఈ తన్నులాటతో వారి భవిష్యత్ ఏంటని పెళ్లికి వచ్చిన వారు షాకయ్యారు.

Mount Everest : ఎవరెస్టు శిఖరమా? డంపింగ్ యార్డా? .. ఐఏఎస్ ఆఫీసర్ షేర్ చేసిన వీడియో వైరల్

‘పెళ్లిరోజునే విడాకులకు అప్లై చేసేలా ఉంది వీరి పరిస్థితి’ అని .. కొందరు ‘ఫేక్ వీడియో’ అని మరికొందరు కామెంట్లు చేశారు. ఇటీవల కాలంలో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలవట్లేదు..అసలు వీరి పెళ్లి ఒక్కరోజు కూడా నిలిచే పరిస్థితి కనిపించడం లేదని అతిథులు వాపోయారు. మొత్తానికి ఈ వీడియో వైరల్ అవుతోంది.