కరోనాకు మందు వచ్చేసింది, ఈ కషాయంతో 5రోజుల్లోనే వైరస్ ఖతమంట!

ఈ కషాయాన్ని 5 రోజులు తాగితే కరోనా రోగులు కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే 2 దశల

  • Publish Date - June 20, 2020 / 05:35 AM IST

ఈ కషాయాన్ని 5 రోజులు తాగితే కరోనా రోగులు కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే 2 దశల

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌(కొవిడ్‌-19) నుంచి మానవాళిని రక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయి శాస్త్రవేత్తలు ఈ వైరస్‌ పనిపట్టే వ్యాక్సిన్ తయారీలో తలమునకలయ్యారు. కరోనాకు వ్యాక్సిన్ తయారీ కోసం రాత్రి, పగలు శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ వస్తేనే ఈ మహమ్మారి నుంచి మానవాళిని కాపాడగలమని అన్ని దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే అన్ని దేశాల్లో వ్యాక్సిన్ ప్రయోగాలు చురుకుగా సాగుతున్నాయి. WHO సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 120 రకాల వ్యాక్సిన్ల ప్రయోగాలు జరుగుతున్నాయి. వాటిలో ఓ ఏడు వ్యాక్సిన్లు కచ్చితంగా డిసెంబర్ నాటికి తయారవుతాయని చెబుతున్నారు. ఇప్పటికే మూడు, నాలుగు వ్యాక్సిన్లు మంచి ఫలితాల్ని చూపిస్తున్నాయని వార్తలు వచ్చాయి. 

కరోనాకి ఇదే మందు, 5 రోజుల్లో వైరస్ ఖతం:
ఇది ఇలా ఉంటే కరోనాకి మందు కనిపెట్టేశామని తమిళనాడులోని తాంబరంలో ఉన్న సిద్ధ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు(Siddha Doctors) అంటున్నారు. తాము మూలికలతో తయారు చేసిన ”కబసుర కుడినీర్” (Kabasura Kudineer) అనే కషాయం కరోనాకి మందుగా పని చేస్తుందని సిద్ధా డాక్టర్లు చెబుతున్నారు. ఈ కషాయం కరోనాకి కచ్చితంగా చెక్ పెట్టగలదనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. వైరల్ ఫీవర్లకు మందుగా పని చేసే ఈ కషాయాన్ని 5 రోజులు తాగితే కరోనా రోగులు కోలుకుంటున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇప్పటికే 2 దశల పరీక్షలు పూర్తి చేసుకున్న ఈ కషాయం.. మూడో దశ పరీక్షలు పూర్తి చేసుకుంటే ఐసీఎంఆర్ అనుమతితో కరోనా రోగులకు దీన్ని పెద్ద సంఖ్యలో ఇవ్వొచ్చని సిద్ధా డాక్టర్లు వెల్లడించారు.

2019 డిసెంబర్ నుంచే వనమూలికలతో ప్రయోగాలు స్టార్ట్:
డిసెంబర్‌లో చైనాలో కరోనా వచ్చినప్పుడే సిద్ధా ఇన్‌స్టిట్యూట్ డాక్టర్లు అలర్ట్ అయ్యారట. కరోనా వైరల్ లక్షణాలు తెలుసుకుని వైరస్‌కి చెక్ పెట్టే భారతీయ మూలికలను ఎంపిక చేశారట. వాటితో ఓ చూర్ణం మందును తయారుచేశారు. అదే కబాసుర కుడినీర్. ఎలాగూ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనే నమ్మకంతో కరోనా రోగులను రెండు గ్రూపులుగా చేసి ఏప్రిల్ 1న 5 రోజుల పాటు ఈ మందు ఇచ్చారట. ఆరో రోజున కరోనా పరీక్షలు చెయ్యగా కషాయం తాగిన వారికి రిపోర్టులో నెగెటివ్ వచ్చిందని డాక్టర్లు చాలా ఆనందంగా చెప్పారు. మే, జూన్‌లో SRM మెడికల్ కాలేజీ ఆస్పత్రిలోని కరోనా బాధితులకు మరోసారి ఇదే మందును ఇచ్చి చూశామన్నారు. అక్కడ పాజిటివ్ ఉన్నవారంతా ఐదు రోజుల్లోనే నెగెటివ్ అయిపోయారని తెలిపారు. అంటే ఐదు రోజులు కషాయం తీసుకుంటే కరోనా వైరస్ ఖతం అయిపోతుందన్నారు. అంతేకాదు వారిలో మరోసారి ఎలాంటి కరోనా లక్షణాలు కూడా కనిపించలేదట.

మూడోసారీ ప్రయోగాల్లో సక్సెస్ అయితే కరోనా మందుగా గుర్తింపు:
ఇప్పుడీ డాక్టర్లు భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) పర్మిషన్‌తో పెద్ద సంఖ్యలో ఎక్కువ మంది కరోనా పేషెంట్లకు ఈ మందును ఇచ్చి ప్రయోగాత్మకంగా నిరూపించాలనుకుంటున్నారు. ఇందుకు మరో నెల పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒకవేళ మూడోసారి ప్రయోగాల్లోనూ సక్సెస్ వస్తే అప్పుడు అధికారికంగా కబసురకు గుర్తింపు లభిస్తుంది. మరో అడ్వాంటేజ్ ఏంటంటే వ్యాక్సిన్‌లా ఎక్కువ కాలం పట్టకుండానే ఈ మందుని భారీగా ఉత్పత్తి చేసేందుకు వీలుంటుందని డాక్టర్లు చెబుతున్నారు. సిద్ధా డాక్టర్లు చెబుతున్న మాటలతో అందరిలోనూ ఆశలు చిగురించాయి. ఇది నిజం కావాలని అంతా కోరుకుంటున్నారు. ఇక కరోనా గురించి భయపడాల్సిన పని లేదని అంటున్నారు. 

* ఇందులోని పదార్ధాలను పౌడర్ చేసి నీళ్లతో కలుపుతారు. ఆ తర్వాత ఉడికిస్తారు. అలా డికాషన్ తయారవుతుంది.
* ఈ స్టడీలో పాల్గొన్నవారు
* Dr. V. Vikramkumar, Assistant Medical Officer (Siddha), Tirupattur district
* S. Ganesh, Director, Directorate of Indian Medicine and Homeopathy, Tamil Nadu
* M.P. Sivanarul, Tirupattur District Collector
* P. Parthiban, Joint Director, Directorate of Indian Medicine and Homeopathy, Tamil Nadu
* తిరుపుత్తూరు జిల్లాలోని అగ్రహారం క్వారంటైన్ కేంద్రంలో 42మంది కరోనా రోగులకు కబసుర కుడినీర్ ఇచ్చారు
* ఇంట్లో చేసి తీసుకొచ్చిన ఆహారం ఇవ్వలేదు, పర్యవేక్షకులు తయారు చేసిన ఆహారమే ఇచ్చారు
* 14 రోజుల పాటు తిన్న తర్వాత పెద్దలకు 60 ఎంఎల్, పిల్లలకు 15 ఎంఎల్ కషాయం ఇచ్చారు
* 3 నుంచి 70 ఏళ్ల వయసున్న పేషెట్లకు మందు ఇచ్చారు
* కషాయం తాగాక పొడి దగ్గు రావడంతో ఐదేళ్ల బాలుడిని ఇంటికి పంపేశారు
* కషాయం తీసుకున్న వెంటనే 10 కరోనా రోగులకు అలసట పోయింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపించలేదు
* తొలుత నేరుగా కరోనా సోకిన రోగులకు కషాయం ఇచ్చిన డాక్టర్లు, 5 రోజుల తర్వాత కరోనా నెగిటివ్
* తర్వాత కాంటాక్ట్ ద్వారా కరోనా సోకిన రోగులకు మందు ఇచ్చిన డాక్టర్లు, 5 రోజుల తర్వాత వారికీ నెగిటివ్
* రెండోసారి 42మందికీ ఒకేసారి కరోనా టెస్టులు, రెండోసారి కూడా రిపోర్టులో నెగిటివ్, మరోసారి ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు
* కరోనా నుంచి కోలుకున్న తర్వాత 14 రోజుల క్వారంటైన్, ఆ తర్వాత వారిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. వారికి ఎలాంటి కరోనా టెస్టులు చెయ్యలేదు
* 2019 డిసెంబర్ లో వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూడగానే సిద్ధా డాక్టర్లు అలర్ట్ అయ్యారు.
* కబసుర కుడినీర్(kabasura kudineer), తోంతసుర కుడినీర్(thonthasura kudineer)పై పరిశోధనలు మొదలు పెట్టారు.
* శ్వాస సంబంధ ఇన్ ఫెక్షన్ల ద్వారా వచ్చే జ్వరాలను నయం చేసేందుకు ఈ రెండు మూలికలు వాడతారు
* 4వేల 448 రకాల రోగాలు, రుగ్మతలతో పాటు 64 రకాల జ్వరాలను నయం చేసే మందులు సిద్ధాలో ఉన్నాయి.
* Thontha sura kudineer తో పోలిస్తే కబసుర కుడినీర్ కషాయంలో క్రియాశీల ఫైటో భాగాలు ఎక్కువగా ఉన్నాయి

Read: Coronavirusలో కొత్త విషయం : మెదడుపై వైరస్ దాడి

ట్రెండింగ్ వార్తలు