Signalling failure caused train accident
Signalling failure: సిగ్నలింగ్ వైఫల్యమే ఒడిశా రైలు ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఒడిశా రైలు ప్రమాదం సిగ్నలింగ్ వైఫల్యం ఫలితంగా జరిగిందని శనివారం అధికారుల సంయుక్త తనిఖీ నివేదిక పేర్కొంది. (Signalling failure caused Odisha train accident) రైలు నంబర్ 12841కోరమండల్ ఎక్స్‌ప్రెస్ కు అప్ మెయిన్ లైన్ కోసం సిగ్నల్ ఇచ్చారు. కానీ రైలు లూప్ లైన్‌లోకి ప్రవేశించి, అప్ లూప్ లైన్‌లో ఉన్న గూడ్స్ రైలుతో ఢీకొని పట్టాలు తప్పిందని ప్రాథమిక నివేదిక (preliminary probe) పేర్కొంది.
Triple Train Accident : ఘోర రైలు ప్రమాదంలో 300 మంది మృతి..ప్రధాని మోదీ రాక
దీనివల్ల కోరమండల్ రైలులో 19 బోగీలు పట్టాలు తప్పాయి.ఈ సమయంలో రైలునంబర్ 12864 దిగువ మెయిన్ లైన్ లో రెండు కోచ్‌లు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయి.బెంగళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌లోని రిజర్వ్‌డ్ కోచ్‌లలో ఎవరికీ ఎలాంటి గాయాలు లేదా మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు.బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుతో జరిగిన ఈ ప్రమాదంలో కనీసం 300 మందికి పైగా మరణించారు. మరో 900 మందికి పైగా గాయపడ్డారు.
Odisha train accident Updates: బాలాసోర్ రైలు ప్రమాదం లైవ్ అప్‌డేట్‌లు
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఒడిశాలోని బాలాసోర్‌లో రైలు ప్రమాద స్థలాన్ని సందర్శించి, రెస్క్యూ, రిలీఫ్ కార్యకలాపాలపై ప్రధాన దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఒడిశా రైలు ప్రమాదంపై సౌత్ ఈస్ట్ సర్కిల్ రైల్వే సేఫ్టీ కమిషనర్ విచారణ చేస్తారని మంత్రి చెప్పారు. రైల్వే సేఫ్టీ కమిషనర్ నివేదిక సమర్పించిన తర్వాత ఒడిశాలో రైలు ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని రైల్వే మంత్రి తెలిపారు. ఒడిశా బాలసోర్ లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిందని, ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభమైయ్యాయని శనివారం మధ్యాహ్నం తెలిపారు. రైలు ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ జరిపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామన్నారు.