Silakaa​ Lyrical Song : ‘చెలియో చెల్లకో అత్త తెచ్చిన కొత్త చీర నచ్చకో’.. చమన్ బ్రదర్స్ చితక్కొట్టారుగా..

టాలీవుడ్ రౌడీ స్టార్, యూత్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో, విజయ్ తమ్ముడు తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద విజయ్ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి కలిసి నిర్మిస్తున్న సినిమా ‘పుష్పక విమానం’..

Silakaa Lyrical Song From Pushpaka Vimanam

Silakaa​ Lyrical Song : టాలీవుడ్ రౌడీ స్టార్, యూత్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సమర్పణలో, విజయ్ తమ్ముడు తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ బ్యానర్ల మీద విజయ్ తండ్రి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి కలిసి నిర్మిస్తున్న సినిమా ‘పుష్పక విమానం’..

Read>>>Alia Bhatt : సీతగా అలియా భట్.. ఆకట్టుకుంటున్న లుక్..

శాన్వీ మేఘన, గీతా సైనీ కథానాయికలుగా, దామెదర దర్శకుడిగా పరిచంయ అవుతున్నారు.. ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచ రెస్పాన్స్ వచ్చింది. సోమవారం ఈ సినిమాలోని ‘సిలకా’ అనే లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. రామ్ మిర్యాల ట్యూన్ కంపోజ్ చెయ్యడంతో పాటు ఆనంద్ గుర్రం‌తో కలిసి లిరిక్స్ రాయడంతో పాటు చాలా చక్కగా పాడారు..

Read>>>‘పుష్పక విమానం’ ఫస్ట్‌లుక్..

చమన్ బ్రదర్స్ ఈ పాటలో కనిపించి ఆకట్టుకున్నారు. ఆకాష్ రావురు, లిఖిత్ కోరస్ ఇచ్చారు. ‘సిలకా ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా.. సిలకా సిన్నబోయిందే చిట్టిగుండె పిట్ట నువ్వు లేక.. ప్రేమలోన నేను దేవదాసు.. గుళ్లు కట్టలేని రామదాసు’.. అంటూ ర్యాప్ తరహాలో సాగే ఈ సాంగ్ రిపీట్ మోడ్‌లో వినాలనిపించేలా ఉంది.