Alia Bhatt : సీతగా అలియా భట్.. ఆకట్టుకుంటున్న లుక్..

తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లతో, స్వాతంత్ర్య నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం)..

Alia Bhatt : సీతగా అలియా భట్.. ఆకట్టుకుంటున్న లుక్..

Alia Bhatt As Sita From Rrr Movie

Updated On : March 15, 2021 / 11:51 AM IST

Alia Bhatt: తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పడానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌లతో, స్వాతంత్ర్య నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ప్రెస్టీజియస్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్ – రౌద్రం రణం రుధిరం)..

RRR

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ చిత్రం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటోంది. సోమవారం (మార్చి 15) బాలీవుడ్ కథానాయిక అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలో ఆమె పోషిస్తున్న సీత క్యారెక్టర్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా అతనికి జోడీగా సీత పాత్రలో అలియా కనిపించనుంది.

‘ఆర్ఆర్ఆర్’ క్లైమాక్స్ కోసం నిక్ పోవెల్..

Alia Bhatt

నిండుగా చీర కట్టులో అలియా లుక్ ఆకట్టుకుంటోంది. తారక్ కొమరం భీంగా నటిస్తుండగా అతని ప్రేయసి పాత్రలో ఒలీవియా మోరిస్, మిగతా పాత్రల్లో రే స్టీవెన్ సన్, ఎలిసన్ డూడీ, అజయ్ దేవ్‌గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కనిపించనున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 13న భారీగా విడుదల కానుంది.

Alia Bhatt