Smitha Sabharwal : స్మితా సబర్వాల్‌కు స్వీట్ సర్ ప్రైజ్.. ఆవిడ ఆనందం మామూలుగా లేదు

తెలంగాణ సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్ ఓ సర్ప్రైజ్ అందుకున్నారు. ఆవిడకు కొల్లాపూర్ నుంచి బుట్టెడు మామిడి పండ్లు పంపించారు. ఇందులో సర్ప్రైజ్ ఏముంది అనుకుంటున్నారా? చదవండి.

Smita Sabharwal – Mangoes : మనం వేసిన విత్తనం మొలకెత్తితే ఎంత ఆనందంగా ఉంటుంది.. ఇంక దాని ఫలాలు అందుకున్న క్షణం ఆ ఆనందం మరింత రెట్టింపవుతుంది. తెలంగాణ సీఎంవో అధికారిణి స్మితా సబర్వాల్ అలాంటి ఓ స్వీట్ సర్ప్రైజ్ అందుకున్నారు.

IAS Smita Sabharwal : ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి చొరబడ్డ డిప్యూటీ తహసీల్దార్

డైనమిక్ ఆఫీసర్‌గా స్మితా సబర్వాల్‌కు పేరుంది. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీరియస్‌గా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా స్మితా సబర్వాల్ యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆవిడ ఒక సర్ప్రైజ్ అందుకున్నారు. అదీ మామిడిపండ్లు. అధికారులన్నాక ఎవరో ఒకరు మామిడిపండ్లు పంపుతారు.. అందులో విచిత్రం ఏముంది అనుకోవచ్చు. మూడు సంవత్సరాల క్రితం కొల్లాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్మితా సబర్వాల్ మామిడి మొక్కలు నాటారు. అందులో ఒక మొక్క పెరిగి పెద్దదై ఈ సంవత్సరం మామిడి ఫలాలు ఇచ్చింది. వాటిని ఆవిడ సర్ప్రైజ్‌గా అందుకున్నారు. ఆవిడ ఆనందం ట్విట్టర్‌లో షేర్ చేసుకున్నారు.

HighCourt Shocks Smita Sabharwal : రూ.15లక్షలు తిరిగి ఇచ్చేయండి.. స్మితా సబర్వాల్‌కు హైకోర్టు షాక్

‘కొల్లాపూర్ లో మూడు సంవత్సరాల క్రితం వర్షం రోజున నాటిన మామిడి మొక్క.. ఈరోజు స్వీట్ సర్ ప్రైజ్ అందుకున్నాను. థ్యాంక్యూ గార్డెనర్ శ్రీనివాస్ మరియు @mb_telangana టీం’ అనే శీర్షికతో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ ఇప్పుడు భలే వైరల్ అవుతోంది. ‘మీది లక్కీ హ్యాండ్ మేడమ్.. మీరు ఏది ముట్టుకున్నా అది ఫలవంతమవుతుంది’ ..’ఆర్గానిక పండ్లు సూపర్’ అంటూ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.. స్మితా సబర్వాల్ హరితహారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, పల్లె ప్రగతి కార్యక్రమాల్లో పలుమార్లు మొక్కలు నాటారు. తన పుట్టినరోజు నాడు కూడా ఆవిడ మొక్కలు నాటారు.