Smriti Irani: స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యాకు అదనపు శాఖలు

ఇప్పటికే మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యా సింధియాలకు కేటాయిస్తూ మోదీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ది శాఖా మంత్రిగా కొనసాగుతున్న స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల శాఖను అదనంగా అప్పగించారు.

Smriti Irani: కేంద్ర మంత్రులుగా ఉన్న ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్‌సీపీ సింగ్ తమ పదవులకు బుధవారం రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి శాఖలను ఇప్పటికే మంత్రులుగా ఉన్న స్మృతి ఇరానీ, జ్యోతిరాధిత్యా సింధియాలకు కేటాయిస్తూ మోదీ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర మహిళా, శిశు అభివృద్ది శాఖా మంత్రిగా కొనసాగుతున్న స్మృతి ఇరానీకి మైనారిటీ వ్యవహారాల శాఖను అదనంగా అప్పగించారు. ఇంతకుముందు ఈ శాఖను అబ్బాస్ నఖ్వీ చూసే వారు. అలాగే ఏవియేషన్ మంత్రిగా కొనసాగుతున్న జ్యోతిరాధిత్యా సింధియాకు ఉక్కు శాఖను అప్పగించారు. ఈ శాఖకు ఆర్‌సీపీ సింగ్ మంత్రిగా కొనసాగారు.

Rajya Sabha: రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్.. మరో ఇద్దరు దక్షిణాది వారికి చోటు

ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, ఆర్‌సీపీ సింగ్ తమ రాజీనామాలను ప్రధాని మోదీకి అందించారు. వీరి రాజీనామాలను రాష్ట్రపతికి పంపగా వెంటనే ఆమోదించారు. వీరిద్దరి రాజ్యసభ పదవీకాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పదవులకు కూడా రాజీనామా చేశారు. అయితే, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీకి ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది. లేదా గవర్నర్ పదవి అయినా ఇవ్వొచ్చని సమాచారం. ఈ కారణం వల్లే ఆయన రాజీనామా చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రిగా ఆయన చేసిన సేవలను కేంద్ర క్యాబినెట్ ప్రశంసించింది.

ట్రెండింగ్ వార్తలు