Smuggling Cows : చిత్తూరులో పశువుల అక్రమ రవాణా

చిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని అనేక చోట్ల పశువుల అక్రమ రవాణా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి

Smuggling Cows Chittur : చిత్తూరు జిల్లాలో పశువుల అపహరణ అంశం కలకలం రేపింది. అర్ధరాత్రి వేళ..మినీ లారీలతో వచ్చి పశువులను బలవంతంగా తీసుకెళుతోంది ఓ ముఠా. పశువులను తీసుకెళుతున్న దృశ్యాలు సమీప సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ జిల్లాలోని అనేక చోట్ల పశువుల అక్రమ రవాణా కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తిరుచానూరు వద్ద ఇది వెలుగు చూసింది. కేరళ రాష్ట్రంలోని సంతలు, కబేళాలకు ముఠా తరలిస్తోంది

వృద్ధాప్యంతో ఉన్న పశువులను వెటర్నరీ వైద్యుల సర్టిఫికెట్ తో, నిబంధనల మేరకే చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే..కొంతమంది అక్రమంగా పశువులను తరలిస్తున్నారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, పలమనేరు నుంచి తమిళనాడు మీదుగా కేరళకు పశువులను అక్రమంగా రవాణా చేస్తున్నారు.

చట్టాలను బేఖాతరు చేస్తూ యదేచ్ఛగా అర్ధరాత్రి వేళ మినీ లారీల్లో తరలిస్తున్నారు. ముసలి పశువుల ముసుగులో లేగ దూడలను సైతం తరలిస్తున్నారు. చిన్నపాటి మినీ లారీల్లో పదుల సంఖ్యలో పశువులను అక్రమార్కులు తరలిస్తున్నారు. సరిహద్దుల్లో ఉన్న సిబ్బందికి మామూళ్లు సమర్పించుకుంటూ పశువులను రాష్ట్రాలను దాటించేస్తున్నారు. మరి ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు