Mamata Banerjee
Bengal Violence: మహమ్మద్ ప్రవక్తపై నురూప్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లాలో ముస్లింలు శుక్ర, శనివారాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో హౌరా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పంచ్‌లా బజార్‌లో పోలీసులు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ చెలరేగింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో వారిపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. హౌరా జిల్లాలో పలు ప్రాంతాల్లో జూన్ 15 వరకు జనసమూహాలు ఉండకుండా పోలీసులు నిషేధం విధించారు.
prophet row: రాంచీలో హింస.. ఇద్దరి మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం
జూన్ 13 వరకు ఇంటర్నెట్‌ను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. హౌరాలో చెలరేగిన ఉద్రిక్తలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ చేసిన పాపానికి అమాయక ప్రజలు ఎందుకు సమస్యలు ఎదుర్కోవాలని ఆమె నిలదీశారు. హింసాత్మక ఘటనల ప్రభావం రెండు రోజుల నుంచి హౌరాలో సాధారణ జనజీవనంపై పడిందని ఆమె అన్నారు. దీని వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని చెప్పారు. ఆ పార్టీలే అల్లర్లను ప్రేరేపించాయని ఆరోపించారు. ఈ అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇటువంటి చర్యలను ఉపేక్షించబోమని హెచ్చరించారు.