Sonia Gandhi: మొదటిరోజు ముగిసిన సోనియా గాంధీ విచారణ.. మళ్లీ సోమవారం హాజరుకావాలన్న ఈడీ

నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీ విచారణ గురువారం ముగిసింది. తిరిగి సోమవారం మళ్లీ విచారిస్తామని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు ఈ విచారణకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టాయి.

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ విచారణ మొదటిరోజు ముగిసినట్లు ప్రకటించింది ఈడీ. గురువారం సోనియా గాంధీ ఈడీ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. దాదాపు రెండున్నర గంటలపాటు సోనియా విచారణ కొనసాగింది. ఆ తర్వాత అధికారులు లంచ్ బ్రేక్ ఇచ్చారు. దీంతో సోనియా గాంధీ ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చి, ఇంటికి బయల్దేరారు.

Hyderabad Youtuber Suicide: వ్యూయర్స్ పెరగడం లేదని హైదరాబాద్ యూట్యూబర్ ఆత్మహత్య

అయితే, బ్రేక్ తర్వాత విచారణకు రానవసరం లేదని, గురువారం నాటి విచారణ ముగిసిందని అధికారులు సమాచారం అందించారు. తిరిగి సోమవారం విచారణ జరుపుతామని, ఆ రోజు హాజరుకావాలని సూచించారు. సోనియాను ప్రశ్నించిన అధికారుల బృందంలో మహిళా అడిషనల్ డైరెక్టర్ మోనికా శర్మ ఉన్నారు. ఆమెతోపాటు మరో ఐదుగురు అధికారులు ఈ విచారణలో పాల్గొన్నారు. అలాగే సోనియా ఆరోగ్యం, వయస్సును దృష్టిలో ఉంచుకుని ఒక మహిళా డాక్టర్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ విచారణకు సోనియా గాంధీతోపాటు ఆమె కూతురు ప్రియాంకా గాంధీ, సోనియా తరఫు లాయరు హాజరయ్యారు. వారు వేరే గదిలో ఉన్నారు. ఇటీవలే కోవిడ్ బారిన పడి కోలుకున్న సోనియా పోస్ట్ కోవిడ్ సమస్యలతో బాధపడుతున్నారు.

Tirumala: శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల తేదీలు

ప్రతి మూడు, నాలుగు గంటలకు ఒకసారి నెబ్యులైజేషన్ చేయాల్సి ఉంటుంది. మరోవైపు సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్త నిరసనలు చేపట్టాయి. ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై వాటర్ కెనాన్స్ ప్రయోగించారు. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, అసోంలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు