Site icon 10TV Telugu

South Africa Woman: ఒకే కాన్పులో 10 మంది పిల్లలకు జన్మనిచ్చిన మహిళ… ఇది ప్రపంచ రికార్డు?

South Africa Woman Give Birth To Ten Child

South Africa Woman Give Birth To Ten Child

South Africa Woman: ఒకే కాన్పులో ఏకంగా 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది ఓ మహిళ.. ఒకే కాన్పులో ఇంతమంది పిల్లలు పుట్టడం తొలిసారి కావచ్చని.. అదే ప్రపంచ రికార్డు అవుతుందని అంటున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన 37 ఏళ్ల గోసియామే థమారా సిథోలే 10 మంది పిల్లలకు జన్మనిచ్చింది. వారిలో ఏడుగురు మగ పిల్లలు కాగా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. వీరంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇక ఈ విషయంపై గోసియామే థమారా సిథోలే భర్త తెబోగో సోతెత్సీ మాట్లాడారు.

ప్రిటోరియాలోని ఆస్పత్రిలో జులై 7న పిల్లలకు జన్మనిచ్చిందని తెలిపాడు. ఆరు నెలల గర్భం సమయంలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆరుగురు పిల్లలు ఉన్నట్లు తెలిపారని, ఆ తర్వాత మరోసారి స్కాన్ చేసినప్పుడు 8 మంది ఉన్నట్లు గుర్తించారని, పిల్లలు పుట్టినప్పుడు మాత్రం మొత్తం 10 మంది ఉన్నట్లు తేలిందని తెలిపారు.

అయితే ఈ దంపతులకు ఇప్పటికే ఆరేళ్ళ కవలలు ఉన్నారు. ఇప్పుడు వారికి మరో 10 మంది యాడ్ అయ్యారు. ఏ ఉద్యోగం లేకపోయినా వీరిని జాగ్రత్తగా చూసుకుంటానని తండ్రి తెబోగో సోతెత్సీ తెలిపారు. ఇంతమంది పిల్లలు పుట్టడం ఆనందంగా ఉందని వివరించాడు. మరోవైపు గత నెలలో మొరాకోలో హాలిమా సిస్సే అనే మహిళ 9 మంది పిల్లలకు జన్మనిచ్చింది. ఆమె రికార్డును గోసియామే థమారా సిథోలే బ్రేక్ చేశారు.

 

Exit mobile version