Woman Marriage with Lord Krishna : శ్రీకృష్ణుడితో వికలాంగ కూతురుకి వివాహం జరిపించిన తండ్రి..

ఆడబిడ్డను కన్న ప్రతీ తండ్రీకి తన కూతురుకి ఏదోక రోజు పెళ్లి చేయాలనుకుంటాడు. అల్లుడు కూతురుని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా కంటతడి పెట్టకుండా చూసుకోవాలనుకుంటాడు. ఇదీ ప్రతీ తండ్రీ ఆశపడేదే. అలా ఓ తండ్రి తన కూతురుకి సాక్షాత్తు శ్రీకృష్ణుడితో వివాహం జరిపించాడు.

young woman Marriage with Lord Krishna : ఆడబిడ్డను కన్న ప్రతీ తండ్రీకి తన కూతురుకి ఏదోక రోజు పెళ్లి చేయాలనుకుంటాడు. అల్లుడు కూతురుని పువ్వుల్లో పెట్టి చూసుకోకపోయినా కంటతడి పెట్టకుండా చూసుకోవాలనుకుంటాడు. ఇదీ ప్రతీ తండ్రీ ఆశపడేదే. పెళ్లి చేసిన పంపిస్తే కూతురు తనని వదిలి వెళ్లిపోతుందనే బాధ ఒకవైపు..తన బాధ్యతను ఎంతో ఆనందంగా చేయటానికి పడే తపన మరోవైపు ఇవన్నీ కలగలిసిన ఆనందోగ్వేదాలు కూతురు పెళ్లిలో అనుభవిస్తాడు తండ్రి. ఇన్నాళ్లు గుండెల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేసిన కూతురు మరో ఇంటికి వెళ్లిపోతుందనే గుండెల్లో చెప్పలేనంత బాధ ఉన్నా పైకి మాత్రం గుంభనంగా పెళ్లిని ఘనంగా చేయాలని తపనపడతాడు ప్రతీ తండ్రీ. కానీ ఓ తండ్రి మాత్రం తనకూతురుకి ఎప్పటికీ వివాహం చేయలేనని బెంగపడ్డాడు. కారణం కూతురు నడవలేదు..మాట్లాడలేదు. కనీసం తను చెప్పే మాటలు వినబడవు. అయినా కూతురు కూతురే కదా.. కళ్లలో పెట్టి ఏ కష్టం రాకుండా చూసుకున్నాడు. కానీ అందరి తండ్రుల్లాగా తన కూతురుకి వివాహం చేయలేకపోతున్నాననే బెంగ వేధించేది. చెప్పలేనంత బాధగా ఉండేది గుండెల్లో..కానీ పైకి మాత్రం కనిపడనిచ్చేవాడు కాదు..తన చిట్టితల్లి ఎక్కడ బాధపడుతుందోనని..

కానీ మనస్సు ఉంటే మార్గం ఉండదా? అనుకున్నాడు. అందరిలానే తన కూతురుకి వివాహం చేయాలనుకున్నాడు. కానీ సాధారణ మనుషులతో కాదు..సాక్షాత్తు శ్రీకృష్ణుడితోనే వివాహం చేయాలనుకున్నాడు. వినటానికి ఇది వింతగా నమ్మశక్యంగా లేకపోయినా ఆ తండ్రికి వచ్చిన ఆలోచనలు అమలు చేశాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడితో వివాహం జరిపించాడు…ఈ అరుదైన హాట్ టాపిక్ గా మారిన ఈ వివాహానికి బంధువులు..హితులు..స్నేహితులు అందరు తరలివచ్చారు. ఆ చిట్టితల్లిని మనసారా ఆశీర్వదించారు.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగిన ఈ అరుదైన వివాహం వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో శివపాల్ రాథోర్ వ్యాపారవేత్త. అతను కుమార్తె దివ్యాంగురాలు. నడవలేదు..మాట్లాడలేదు, చెవులు వినబడవు. 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కూతురిని శివపాల్ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. కుమార్తెకు వివాహం చేయాలని ఆశ. కానీ సంబంధాలు చూసినా ఆమెను వివాహం చేసుకోవటానికి ఎవ్వరు ముందుకురాలేదు. కానీ నా కూతురికి వివాహం చేసి తీరుతాను..ఈ వివాహం గురించి అందరు విశేషంగా చెప్పుకుంటారు అని నిశ్చయిచుకున్న శివపాల్.. కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు.

అనుకున్నదే ఆలస్యం.. కుమార్తెకు వివాహం నిశ్చయించామని, తప్పకుండా రావాలంటూ బంధుమిత్రులకు ఫోన్లు చేసి ఆహ్వానించాడు. శ్రీకృష్ణుడితో వివాహం అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అయినప్పటికీ అందరూ వివాహానికి హాజరయ్యారు. పెళ్లికి ముందు మామూలుగానే మెహందీ వేడుక, విందు, ఊరేగింపు నిర్వహించారు. ఓ ఆలయంలో జరిగిన ఈ పెళ్లిలో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న అమ్మాయి, వధువు పూలదండలు మార్చుకున్నారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు వారిని ఆశీర్వదించారు. ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుక ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

 

,

ట్రెండింగ్ వార్తలు