Sputnik V Vaccine: హైదరాబాద్ చేరిన మరో 1.50లక్షల డోసులు!

దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా విలయతాండవం కొనసాగుతుంటే వ్యాక్సిన్ల కొరతతో తీవ్ర ఆందోళన, ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే మనం దేశంలో హైదరాబాద్ మేడ్.. భారత్ బయోటెక్ కొవాగ్జిన్, ఆక్స్ ఫర్డ్ తో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ తెచ్చిన కోవిషీల్డ్ వ్యాక్సిన్లు మన దేశంలో వినియోగిస్తుండగా

Sputnik V Vaccine: దేశవ్యాప్తంగా ఒకవైపు కరోనా విలయతాండవం కొనసాగుతుంటే వ్యాక్సిన్ల కొరతతో తీవ్ర ఆందోళన, ఒత్తిడి నెలకొంది. ఇప్పటికే మనం దేశంలో హైదరాబాద్ మేడ్.. Bharat Biotech Covaxin, ఆక్స్ ఫర్డ్ తో కలిసి సీరం ఇనిస్టిట్యూట్ తెచ్చిన Covishield వ్యాక్సిన్లు మన దేశంలో వినియోగిస్తుండగా ప్రజలకు అవసరమైన మేర ఇవి ఇంకా అందుబాటులో లేవు. అయితే, ప్రస్తుతం నెలకొన్న వ్యాక్సినేషన్ కొరతను అధిగమించే దిశగా మరో అడుగు ముందకు పడింది.

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వీ (Sputnik V) వ్యాక్సిన్ ఇప్పటికే ఒక విడత మన దేశంలో అది కూడా మన హైదరాబాద్ లోని Dr Reddys Labకు చేరగా ఇప్పుడు రెండో బ్యాచ్ కొద్దిసేపటి కిందటే హైదరాబాద్‌కు చేరుకుంది. తొలి విడతలో 1.5 లక్షల డోసులు హైదరాబాద్ చేరగా.. ఇప్పుడు మరోసారి 1.5 లక్షల డోసుల వ్యాక్సిన్‌ హైదరాబాద్‌‌కు చేరినట్లుగా అధికారులు వెల్లడించారు. రష్యా నుంచి బయలుదేరిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన కార్గో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ఈ ఉదయం ల్యాండయింది.

శంషాబాద్ విమానాశ్రయం నుండి వాటిని నేరుగా Dr Reddys Labకు తరలించగా.. ఇక ఈ వారమే Sputnik V Vaccine అందుబాటులోకి రాబోతోంది. మొత్తం 67లక్షల డోసులు కావాలని Dr Reddys Lab కంపెనీ ఆర్‌డీఐఎఫ్‌ను కోరగా.. రష్యా వాటిని విడతల వారీగా పంపిస్తోంది. కాగా, జూన్‌ నుంచి దేశంలోనే Sputnik V Vaccineను ఉత్పత్తి చేయనున్నట్లు Dr Reddys Lab ఇప్పటికే ప్రకటించగా.. ఇటీవల వ్యాక్సిన్‌కు సంబంధించిన ధరను సైతం Dr Reddys Lab ప్రకటించిన సంగతి తెలిసిందే.

Sputnik V Vaccineను రష్యాకు చెందిన గమలేయ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ Epidemiology and Microbiology అభివృద్ధి చేయగా.. రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ ఎగుమతి చేసింది. దీంతో ముందుగానే Dr Reddys Lab రష్యాతో ఒప్పందం చేసుకొని ఇక్కడ ట్రైల్స్ కూడా జరిపింది. Sputnik V Vaccineకు దేశంలో అత్యవసర వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇవ్వగా.. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు వ్యాక్సిన్లకు తోడుగా ఇప్పుడు మూడో వ్యాక్సిన్‌ సైతం అందుబాటులోకి రావడంతో దేశంలో మూడో ద‌శ వ్యాక్సినేష‌న్‌ ప్రక్రియ మ‌రింత వేగ‌వంతం కానుంది.

ట్రెండింగ్ వార్తలు