Sri Lanka Pm Ranil Wickremesinghe
Sri Lanka: ఆర్థిక సంక్షోభానికి తోడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతోన్న ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో ప్రభుత్వ కార్యకలాపాలు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. దీంతో, ఇటీవలే ఆ దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రణిల్ విక్రమసింఘే వారం రోజుల్లో పరిస్థితులను చక్కదిద్దాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. రణిల్ విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణ స్వీకారం తర్వాత తొలిసారి నిర్వహించిన కేబినెట్ సమావేశం ఇది. ప్రభుత్వ వ్యవస్థలు, ప్రధాని కార్యాలయం, అధ్యక్ష సెక్రటేరియట్, పాఠశాలలలో కార్యకలాపాలను వారం రోజుల్లో పూర్తిస్థాయిలో ప్రారంభించాలని ఇందులో నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం దేశంలో ఒక నెలకు సరిపడా ఇంధనం ఉందని, దాన్ని అత్యవసర సేవలకు వినియోగించే అంశాలపై చర్చించారు. భద్రతా బలగాలకు కొన్ని అధికారులు ఇచ్చామని, ప్రజలు భయాందోళనలు చెందకుండా జీవించేందుకు వారు కృషి చేస్తారని కేబినెట్‌కు విక్రమసింఘే ఈ సందర్భంగా చెప్పారు. ఆర్థిక సాయం కోసం అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)తో చర్చలు జరిపే అంశం కూడా కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది.
CBI Probe: అవినీతి మంత్రులు రాజీనామా చేయాల్సిందే: కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్