Sri Lanka Crisis: కేంద్రం కీలక నిర్ణయం.. శ్రీలంక సంక్షోభంపై అఖిలపక్ష భేటీకి పిలుపు

శ్రీలంక సంక్షోభంపై మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంక‌ర్ నేతృత్వంలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది.

Sri Lanka Crisis: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీలంక సంక్షోభంపై మంగళవారం సాయంత్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి జైశంక‌ర్ నేతృత్వంలో ఈ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. అఖిలప‌క్ష స‌మావేశం అనంత‌రం ఈ విష‌యాన్ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. అలాగే, పార్ల‌మెంటులో నిబంధ‌న‌ల ప్ర‌కారం అన్ని అంశాలపై చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

parliament monsoon session: 32 బిల్లులు ప్ర‌వేశ‌పెడ‌తార‌ట‌.. 14 మాత్ర‌మే సిద్ధంగా ఉన్నాయ‌ట‌: ఖ‌ర్గే

కాగా, శ్రీ‌లంకలో తీవ్ర ఆర్థిక‌, ఆహార సంక్షోభం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శ్రీ‌లంక స‌ర్కారుకి వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు చేప‌ట్టిన ఉద్య‌మం నేటికి 100వ రోజుకు చేరుకుంది. శ్రీ‌లంక‌ అధ్య‌క్ష ప‌ద‌వికి గొట‌బాయ రాజ‌ప‌క్స ఇప్ప‌టికే రాజీనామా చేశారు. శ్రీ‌లంక‌కు భార‌త్ ఇప్ప‌టికే ప‌లు ద‌శ‌ల్లో సాయం చేసింది. శ్రీ‌లంక విష‌యంలో చ‌ర్చించ‌డానికి తొలిసారి అఖిలప‌క్ష స‌మావేశం ఏర్పాటు చేస్తుంది. శ్రీ‌లంక విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం ఏ నిర్ణ‌యం తీసుకోనుంద‌న్న ఆస‌క్తి నెల‌కొంది.

ట్రెండింగ్ వార్తలు