Mahanandi Srisailam
Kurnool: కర్నూలు జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రాలైన మల్లిఖార్జున స్వామి వారి ఆలయంతో పాటు మహానంది ఆలయాలలో దర్శన వేళల్లో మార్పులు చేశారు. నేటి (జూన్ 12) నుండి శ్రీశైలం ఆలయంలో స్వామి, అమ్మవార్ల దర్శన వేళల్లో మార్పులు చేశారు. కోవిడ్ దృష్ట్యా విధించిన కర్ఫ్యూ ఆంక్షలు సడలించారు. దీంతో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులకు స్వామి అమ్మవారి దర్శనానికి అనుమతించనున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 1 గంట తరువాత స్వామి, అమ్మవార్లకు జరిగే నిత్యపూజ పూజకైకర్యాలు యధావిధిగా నిర్వహించనున్నారు. ఆలయ పరిధిలోని దుకాణాలు మధ్యాహ్నం 2 గంటల వరకు తెరుచుకునేందు అనుమతించిన దేవస్థానం.. భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. శ్రీశైలం దేవస్థానంతో పాటు నేటి నుండి మహానంది దేవస్థానం యొక్క దర్శనవేళల్లో మార్పు చేసినట్లు కార్యనిర్వహణాధికారి మల్లిఖార్జున ప్రసాద్ తెలిపారు.
ఉదయం 5-00 గంటల నుండి 6-30 వరకు మహానంది దేవస్థానంలో ప్రాతఃకాల సర్కారు సేవలు జరుగనుండగా ఉదయం 6-30 నుండి మధ్యాహ్నం 1-30 వరకు భక్తులకు దర్శనాలు, అన్ని ఆర్జిత సేవలను అనుమతించనున్నారు. కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి దైవదర్శనాలకు భక్తులు సహకరించాలని కోరారు.