ఉక్కు పోరాటం.. రాష్ట్రవ్యాప్తంగా 18న ఆందోళనలు

Steel fight:విశాఖ ఉక్కు విషయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమైంది తెలుగుదేశం పార్టీ. విశాఖ ఉక్కు ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ ఉద్యమించేందుకు కార్యాచరణ ప్రారంభించింది. ఇప్పటికే విశాఖలో స్థానిక ఎమ్మెల్యేల చేత విశాఖ ఉక్కుపై ఆందోళనలు చేయిస్తోన్న టీడీపీ.. ఫిబ్రవరి 18వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమైంది.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపుమేరకు.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు నిరసనలు, ర్యాలీలు చేపట్టాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఉక్కు పరిశ్రమను ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామని హామీ ఇచ్చేంతవరకు విశ్రమించకూడదని నిర్ణయించారు.