Asani Cyclone: అసని తుపాన్.. హెల్ప్‌లైన్ నెంబర్ల ఏర్పాటు

అసని తుపాను నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ, విశాఖ పట్నం సూచించింది.

Asani Cyclone: అసని తుపాను నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు అందుబాటులో ఉండేలా హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటు చేసింది. అత్యవసర సహాయం కోసం 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణా సంస్థ, విశాఖ పట్నం సూచించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అసని తుపాన్ కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం డైరెక్టర్ సునంద చెప్పారు. ఈ తుపాను తన దిశను మార్చుకుని, గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో ఉత్తర ఈశాన్య దిశకు కదులుతోందని సునంద అన్నారు.

Asani Cyclone: తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రాగల 12 గంటల్లో తుపాను మరింత బలహీనపడి, వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. రేపు ఉదయం వరకు 40-60 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరంలో గాలులు వీస్తాయని, ప్రస్తుతం తుపాను తీరం మీదుగా ప్రయాణం చేస్తుందని డైరెక్టర్ వెల్లడించారు. మరికొద్ది గంటల్లో సముద్రంలోకి ప్రవేశించి క్రమేపీ బలహీనపడుతుందన్నారు. కాకినాడకు ఎగువన ఉన్న పోస్టులలో ఏడో నెంబరు ప్రమాద హెచ్చరిక, దిగువన ఉన్న పోస్టులలో ఐదో నెంబరు ప్రమాద హెచ్చరిక జారి చేసినట్లు చెప్పారు. కాగా, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ట్రెండింగ్ వార్తలు