Student Suicide: ఎగ్జామ్ సెంటర్‌లో అవమానం.. యువకుడి ఆత్మహత్య!

కారణమేదైనా సూసైడ్ అంటే కొందరు సింపుల్ గా భావిస్తున్నారు. అవమానమే జరిగినా కోపమే వచ్చినా చివరికి బలవన్మరణమే పరిష్కారంగా భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలో జరిగే చిన్న చిన్న అవమానాలకు కూడా సీరియస్ గా తీసుకొని ప్రాణాలు విడుస్తున్నారు.

Student Suicide: కారణమేదైనా సూసైడ్ అంటే కొందరు సింపుల్ గా భావిస్తున్నారు. అవమానమే జరిగినా కోపమే వచ్చినా చివరికి బలవన్మరణమే పరిష్కారంగా భావిస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థి దశలో జరిగే చిన్న చిన్న అవమానాలకు కూడా సీరియస్ గా తీసుకొని ప్రాణాలు విడుస్తున్నారు. పరీక్షా కేంద్రంలో అవమానం జరిగిందని ఓ విద్యార్థి ఏకంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. ఎగ్జామ్ హాల్లో ప్యాంట్ విప్పించి తనిఖీ చేశారని అవమానం భరించలేని ఇంజనీరింగ్ విద్యార్థి ఎగ్జామ్ హల్ నుండి రైల్వే ట్రాక్ మీదకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నాగరాజు-ఇందిర దంపతుల కుమారుడు 19 ఏళ్ల కుమారుడు ఎలీషా చీరాల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈఈఈ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈనెల 19 నుండి కాలేజీలో పరీక్షలు జరుగుతుండగా ఎలీషా కూడా వాటికి హాజరవుతున్నాడు. అయితే, ఈరోజు పరీక్షకు హాజరైన అలీషా భారీగా స్లిప్పులు పెట్టి హాజరయ్యాడు. ఈక్రమంలో పరీక్ష జరుగుతుండగా ఇన్విజిలేటర్, అబ్జర్వర్ కు ఎలీషా మీద అనుమానం వచ్చింది.

దీంతో ఎలీషాను ప్యాంట్ విప్పించి మరీ వాళ్ళు తనిఖీలు చేశారు. ఈక్రమంలో భారీగా స్లిప్పులు లభించడంతో ఎలీషాను డీబార్ చేసి పరీక్ష రాయనివ్వకుండా బయటకు పంపారు. దీంతో మనస్థాపానికి గురైన ఎలీషా కాలేజీ నుండి నేరుగా రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం అందించిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం చీరాల హాస్పిటల్ కు తరలించారు. ఎలీషా మరణ వార్తతో ఇటు వేటపాలెం, చీరాల కాలేజీలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.

Read: Corona Second Wave: భారత్‌లో ఉత్పత్తిని ఆపేస్తున్న ‘హీరో’ మోటో కార్ప్!

ట్రెండింగ్ వార్తలు