Sudheer Babu: సైలెంట్‌గా స్టార్ట్ చేసిన సుధీర్ బాబు!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. కథలో దమ్ము, తన పాత్రకు తగిన....
- Anil Aaleti
- Published On : March 29, 2022 / 06:11 PM IST
Sudheer Babu New Movie Starts Regular Shoot
Sudheer Babu: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. కథలో దమ్ము, తన పాత్రకు తగిన ప్రాధాన్యత ఉంటే ఎలాంటి రోల్ చేసేందుకైనా సుధీర్ బాబు రెడీ అంటున్నాడు. కాగా హీరోగా కూడా వైవిధ్యం ఉన్న కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ఈ యంగ్ హీరో. ఆయన నటించిన చివరి చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ మూవీగా నిలిచింది.
Sudheer Babu: లాభాలు కురిపిస్తున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’!
ఇక తన నెక్ట్స్ మూవీగా ఇప్పటికే బ్యాడ్మింటన్ ఆటగాడు పుల్లెల గోపీచంద్ బయోపిక్‌లో నటిస్తున్నాడు సుధీర్ బాబు. దీంతో పాటు తన కెరీర్‌లో 16వ చిత్రంగో ఓ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కూడా నటించేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో. అయితే ఈ సినిమాకు సంబంధించి గతంలోనే అనౌన్స్‌మెంట్ చేసిన సుధీర్ బాబు, తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేశాడు. దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.
కాగా ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో ‘ప్రేమిస్తే’ ఫేం భరత్, శ్రీకాంత్, జెమిని సురేష్, అజయ్ రత్నం తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నికల్ డిపార్ట్‌మెంట్ వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా సైలెంట్‌గా షూటింగ్ మొదలుపెట్టిన సుధీర్ బాబు ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
It was an intense beginning…
Super pumped for some serious action ?? #Sudheer16@bharathhere @actorsrikanth @Imaheshh #Anandaprasad @BhavyaCreations @anneravi @vincentcinema pic.twitter.com/LUOCYedqCD
— Sudheer Babu (@isudheerbabu) March 29, 2022
