Sunil Deodhar
Sunil Deodhar: సీఎం జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో ఆంధ్ర ప్రదేశ్‌ను అధోగతి పాలు చేశారని విమర్శించారు బీజేపీ సీనియర్ నేత, ఏపీ సహ ఇన్‌ఛార్జి సునీల్ దియోధర్. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపేశారని అభిప్రాయపడ్డారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నద్దా ఏపీ పర్యటన సదర్భంగా సునీల్ దియోధర్ సోమవారం 10 టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ పాలన, ఏపీలో పార్టీ భవిష్యత్ వంటి అంశాలపై స్పందించారు. ‘‘జగన్ ఢిల్లీ వెళ్లి వేంకటేశ్వర స్వామి ఫొటో మోదీకి ఇచ్చి, ఆయన ఆశీస్సులు తీసుకున్నా ప్రయోజనం లేదు. రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలో దింపారు. ఏపీ అభివృద్ధికి మోదీ ఎంతగానో కృషి చేస్తున్నారు. జనసేతో ప్రస్తుతం పొత్తులో ఉన్నాం.
Old Man Burnt Alive: మంత్రాల నెపంతో వృద్ధుడి సజీవ దహనం
ఈ విషయంలో మేం చాలా స్పష్టతతో ఉన్నాం. జనసేనతో మా పొత్తు కొనసాగుతుంది. ప్రస్తుతం జనసేన-బీజేపీ కలిసి ప్రభుత్వంపై పోరాడుతున్నాయి. రాష్ట్ర పరిస్థితులపై జేపీ నద్దా మాట్లాడుతారు. సీఎం అభ్యర్థిని ఇప్పుడే ప్రకటించరు అనుకుంటున్నా. మా రోడ్ మ్యాప్ ఎప్పుడో సిద్ధమైంది. ఇప్పటికే మేం యాక్షన్‌లోకి దిగిపోయాం. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యం’’ అని సునీల్ దియోధర్ వ్యాఖ్యానించారు.