Sunny Leone: సన్నీ దెబ్బకు పరుగులు పెట్టిన మంచు విష్ణు.. మీమర్స్‌కు కొత్త స్టఫ్!
శృంగార తార సన్నీ లియోన్ బాలీవుడ్‌లో హాట్ ఐటెం సాంగ్స్, వ్యాంప్ తరహా పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే అడపాదడపా ఈ బ్యూటీ...
- Anil Aaleti
- Published On : April 8, 2022 / 02:00 PM IST
Sunny Leone Manchu Vishnu Prank Goes Viral
Sunny Leone: శృంగార తార సన్నీ లియోన్ బాలీవుడ్‌లో హాట్ ఐటెం సాంగ్స్, వ్యాంప్ తరహా పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. అయితే అడపాదడపా ఈ బ్యూటీ దక్షిణాది చిత్రాల్లో మెరుస్తూ ఇక్కడి జనాలను కూడా ఎంటర్‌టైన్ చేస్తోంది. కాగా గతకొంత కాలంగా సినిమాలను బాగా తగ్గించేసిన సన్నీ లియోన్, ఇప్పుడు ఏకంగా ఓ తెలుగు సినిమాలో నటిస్తూ సందడి చేస్తోంది. గతంలో మంచు మనోజ్ నటించిన ‘కరెంటు తీగ’ సినిమాలో సన్నీ పర్ఫార్మెన్స్‌కు ఇక్కడి కుర్రకారు ఫిదా అయ్యారు.
Sunny Leone: మంచు వారితో సన్ని లియోన్.. ఎక్కడికి వెళ్లిందంటే?
ఇప్పుడు మరో మంచు హీరో విష్ణు నటిస్తున్న తాజా చిత్రంలో సన్నీ నటిస్తోంది. ఈ సినిమాకు ‘గాలి నాగేశ్వర రావు’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ పెట్టినట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో అందాల భామలు పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా హైదరాబాద్‌లో ఉన్న సన్నీ లియోన్.. షూటింగ్ మధ్యలో గ్యాప్ దొరికినప్పుడుల్లా వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది. ఇటీవల మోహన్ బాబుతో కలిసి తిరుపతిలోని ఆయన విశ్వవిద్యాలంలో స్టూడెంట్స్‌ను కలిసిన వీడియోను సన్నీ షేర్ చేసింది.
తాజాగా మంచు విష్ణుపై ఓ ప్రాంక్ వీడియో చేయాలని ప్రయత్నించి ఫెయిల్ అయ్యానంటూ ఓ ఫన్నీ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టుకొచ్చింది ఈ బ్యూటీ. సన్నీ తన ముఖానికి ఓ మాస్క్ పెట్టుకుని మంచు విష్ణుని భయపెట్టాలని చూసింది.. కానీ ఆ మాస్క్‌ను చూసి మంచు విష్ణు ఏమాత్రం భయపడడు. అయితే వెంటనే సన్నీ తన మాస్క్ తీయగా, ఆమె ముఖాన్ని చూసి భయపడి అక్కడి నుండి పరుగులు పెడతాడు.
Sunny Leone: మంచు హీరోలతో సన్నీ.. అప్పుడు మనోజ్, ఇప్పుడు విష్ణు!
చూడటానికి స్క్రిప్టెడ్ ప్రాంక్‌లా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు పలు కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో మంచు విష్ణుని మీమర్స్ ఏ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ ప్రాంక్ వీడియో పుణ్యమా అని మీమర్స్‌కు కొత్త స్టఫ్ దొరికిందనే చెప్పాలి. అసలు సన్నీ, మంచు విష్ణు ఈ ప్రాంక్ వీడియోను ఎందుకు తీశారో వారికే తెలియాలని అంటున్నారు నెటిజన్లు. సోషల్ మఅడియాలో ఇలాంటి ప్రాంక్ వీడియోలు కోకొల్లలుగా ఉన్నా, ఎలాంటి కొత్తదనం లేని ఈ వీడియోతో సన్నీ తన ఇమేజ్‌ను తానే తక్కువ చేసుకుంటుందని ఆమె అభిమానులు అంటున్నారు.
And again epic fail for me!! ?
.
.#SunnyLeone #VishnuManchu pic.twitter.com/CWB2rAUAEd— Sunny Leone (@SunnyLeone) April 8, 2022
