Superstar Krishna Mortal To Be Remained At Nanakramguda Residence
Superstar Krishna: సూపర్ స్టార్ కృష్ణ మృతిచెందడంతో ఆయన భౌతికకాయానికి నివాళులర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు నానక్‌రామ్‌గూడలోని కృష్ణవిజయ నిలయంకు చేరుకుంటున్నారు. అయితే అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని సాయంత్రం గచ్చిబౌలి స్టేడియంకు తరలిస్తారని కుటుంబ సభ్యులు తొలుత తెలిపారు.
Superstar Krishna Passed Away: సూపర్ స్టార్ కృష్ణ భౌతికకాయానికి టాలీవుడ్ నివాళి
కానీ, కొన్ని కారణాల వల్ల కృష్ణ భౌతికకాయాన్ని నానక్‌రామ్‌గూడలోని ఇంటివద్దే ఉంచుతున్నారు. అంతేగాక, అభిమానులకు కృష్ణను కడసారి చూసేందుకు అనుమతిని కూడా ఇచ్చారు. ఇక రేపు ఉదయం 7 గంటలకు కృష్ణ భౌతికకాయాన్ని పద్మాలయ స్టూడియోకు తరలించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు పద్మాలయ స్టూడియోలో మరికొందరు ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం కృష్ణ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఆ తరువాత మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
Mahesh Babu: మహేశ్ బాబును ఓదార్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్
ఈ వార్తతో కృష్ణ అభిమానులు పెద్ద సంఖ్యలో నానక్‌రామ్‌గూడకు చేరుకుంటున్నారు. తమ అభిమాన హీరోను కడసారి చూసి వారు కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా, కృష్ణ మృతికి సంతాపం తెలుపుతూ రేపు టాలీవుడ్ సినీ పరిశ్రమ బంద్‌ను పాటించనున్నట్లు చలనచిత్ర నిర్మాతల మండలి ప్రకటించింది. ఇక కృష్ణ అంతిమయాత్రలో టాలీవుడ్ నటులు అందరూ పాల్గొనాలని ‘మా’ పిలుపునిచ్చింది.