తిరుమలలో సుప్రభాత సేవలు షురూ

Suprabhata Seva in Tirumala : తిరుమల శ్రీవారి ఆలయంలో తిరిగి సుప్రభాత సేవలు మొదలయ్యాయి. ధనుర్మాసం 2021, జనవరి 14వ తేదీ గురువారం పూర్తి కావడంతో యథావిధిగా 2021, జనవరి 15వ తేదీ శుక్రవారం సుప్రభాత సేవను స్వామివారికి ఉదయం నిర్వహించారు. డిసెంబర్ 16 నుంచి ధనుర్మాస ఘడియలు ప్రారంభం కావడంతో డిసెంబర్ 17 నుండి శ్రీవారి ఆలయంలో సుప్రభాతం స్థానం గోదా తిరుప్పావై పారాయణం నిర్వహించారు.

కరోనా నిబంధనల ప్రకారం సుప్రభాత సేవకు భక్తులను అనుమతించకుండానే ఏకాంతంగా సుప్రభాత సేవను అర్చకులు, ఆలయ అధికారులు నిర్వహించారు. తిరుప్పావై పఠనం ముగింపుగా శుక్రవారంఉదయం శ్రీవారి ఆలయంలో గోదా పరిణయోత్సవం నిర్వహించారు. కనుమ పండుగను పురస్కరించుకుని మధ్యాహ్నం తిరుమల పాపవినాశనం రోడ్డులోని పార్వేటమండపం వద్ద పార్వేట ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారు ఆయుధాలు ధరించి వేటాడే కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం స్వామివారికి సార్వేటి మండపంలో స్పపన తిరుమంజనం జరిగింది. అన్నమాచార్య కళాకారులచే చేసిన అన్నమయ్య కీర్తనలు అలరించాయి.

ట్రెండింగ్ వార్తలు