రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Supreme Court Key Orders on Farmers Agitation  : రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రైతులు ఆందోళన కొనసాగించవచ్చునని సుప్రీం స్పష్టం చేసింది. రైతులకు నిరసన తెలిపే హక్కుందని ధర్మాసనం పేర్కొంది. కానీ, రోడ్లు, నగరాలను దిగ్బంధించకండని కోర్టు రైతు ఆందోళనకారులకు సూచించింది.

ఇతరుల హక్కులకు భంగం కలిగేలా ఆందోళన ఉండకూడదని తెలిపింది. ఆందోళనలు విధ్వంసంగా మారకుండా రైతులు చూసుకోవాలని సుప్రీం సూచనలు చేసింది. సమస్య పరిష్కారానికి కమిటి ఏర్పాటు ఒక్కటే మార్గమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ప్రధాన మంత్రి మోదీ. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 20 రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 19లోపు కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను రద్దుచేయకపోతే… ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని రైతు సంఘాలు హెచ్చరించాయి.

తమ పోరాటం శాంతియుతంగా కొనసాగుతోందని… దాన్ని హింసాత్మకంగా మార్చవద్దని కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. కొత్త చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళన విరమించబోమని తేల్చి చెప్పాయి.