Suspicious Boat In Mumbai-Raigad Harihareshwar
Suspicious Boat In Mumbai-Raigad Harihareshwar : మహారాష్ట్ర సముద్ర తీర ప్రాంతంలో ఓ అనుమానాస్పద బోట్ తీవ్ర కలకలం సృష్టించింది. ముంబై రాయ్ ఘడ్ జిల్లా హరిహరేశ్వర్ సముద్ర తీర ప్రాంతంలో అనుమానాస్పదంగా ఉన్న ఓ బోట్ ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ బోట్ నుంచి 3AK 47 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మొదట ఆ బోట్ ను ఆ ప్రాంతానికి చెందిన మత్స్యకారులదని అనుకోగా.. అది సంద్రంలో తేలుతూ.. ఎంతసేపటికి ఒడ్డుకు చేరకపోవడంతో.. స్థానికులకు అనుమానమొచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు. దీంతో హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసు యంత్రాంగం ఆ బోటును స్వాధీనం చేసుకున్నారు. ఆ బోటు నుంచి మూడు ఏకే 47తో సహా మరికొన్ని భారీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇది ఉగ్రవాదుల పనేనా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.ఆబోటులో వచ్చినవారు ఎక్కడికెళ్లారు? అనే టెన్షన్ నెలకొంది.
ఈ ఘటనతో రాయగడలో హైఅలెర్ట్ ప్రకటించారు పోలీసులు. తీర ప్రాంతం నుంచి వచ్చే ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రమంతా పండుగ వాతావరణం నెలకొంది. దహీహండీ, గణేశోత్సవాలు సమీపిస్తుండటంతో.. రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలకు కుట్ర ఏమైనా జరుగుతోందా అనే చర్చ మొదలైంది. ఎందుకంటే 2008లో 26/11 ముంబై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడులు చేయటానికి ఉగ్రవాదులు కసబ్ గ్యాంగ్ ముంబైకి బోటులో వచ్చారు.అలా వచ్చిన ఉగ్రవాదులు ముంబైలో ఎంతటి విధ్వంసాన్ని సృష్టించారో తెలిసిందే.