Pakisthan
Is Taliban with Kashmir: ప్రపంచమంతా తాలిబాన్ల కుట్రల వెనుక పాకిస్తాన్ ఉందంటూ ఆరోపిస్తోన్న వేళ పాకిస్తాన్ చేసిన ఓ ప్రకటన అనుమానాలు నిజమే అనే సందేశాన్ని ఇచ్చింది. కశ్మీర్ విషయంలో భారత్‌తో పోరాటానికి తాలిబాన్ల సాయం తీసుకుంటామని పాకిస్తాన్ అధికార పార్టీ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ) అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ అన్నారు. ఈ మాట ఇప్పుడు ఇప్పుడు ప్రపంచవర్గాల్లో తాలిబన్లకు పాకిస్తాన్ సపోర్ట్ ఉందనే విషయాన్ని బట్టబయలు చేసింది.
ఓ టీవీ చర్చా కార్యక్రమంలో కశ్మీర్ అంశంపై పాకిస్తాన్‌తో చేతులు కలుపుతామని తాలిబన్లు చెప్పినట్లుగా నీలం ఇర్షాద్ షేక్ వెల్లడించారు. పీటీఐ అధికార ప్రతినిధి నోటి నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడగానే ఛానెల్ న్యూస్ యాంకర్.. “ఈ షో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం అవుతుంది. భారతీయులు కూడా చూస్తుంటారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా?” అని నీలం ఇర్షాద్ షేక్‌ను ప్రశ్నించారు. కానీ అతడు ఇవేవి పట్టించుకోకుండా.. “తాలిబన్లు మాకు సాయం చేస్తారు” అని అన్నారు.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐతో తాలిబన్లకు చాలా కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు ప్రపంచం భావిస్తుండగా.. పాకిస్తాన్ బహిరంగంగా తాలిబాన్ ఉగ్రవాదులకు సహాయం చేస్తోందని ఆరోపిస్తున్న సమయంలో నీలం ఇర్షాద్ ప్రకటన మరింత హీట్ పుట్టిస్తోంది. అఫ్ఘానిస్తాన్‌లో యుద్ధ సమయంలో.. వేలాది మంది ఉగ్రవాదులు పాకిస్థాన్‌లోని గిరిజన ప్రాంతాల నుండి అఫ్ఘానిస్తాన్‌కు వలస వచ్చారు. పాకిస్తాన్ సైన్యం మరియు ISI సహాయంతో అఫ్ఘానిస్తాన్‌లో తాలిబాన్ పాలన వచ్చిందని నిపుణులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే, ఇండియా టుడేతో మాట్లాడుతూ, తాలిబాన్ ప్రతినిధి సుహైల్ షహీన్.. భారత్ మరియు పాకిస్తాన్ మధ్య పోటీలో తాలిబాన్లు జోక్యం చేసుకోరని అన్నారు. భారతదేశం, పాకిస్తాన్ మధ్య పోరాటంలో మేము భాగం కావాలని అనుకోవడం లేదని అన్నారు. మేము స్వేచ్ఛ కోసం పోరాడుతున్నామని అన్నారు. తాలిబాన్ల అజెండాలో కశ్మీర్ లేదని అన్నారు.
మరోవైపు కశ్మీర్‌లో పెరుగుతున్న ఉగ్రవాదంపై ఆందోళన మధ్య, లోయలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అధికారి తెలిపారు. ఇక మరో ఆందోళన ఏమిటంటే, తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదానికి కేంద్రంగా మారవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికన్లు సరఫరా చేసిన అన్ని ఆయుధాలు మరియు ఆఫ్ఘన్ జాతీయ సైన్యం ఆయుధాలు వారికి అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది.