Tamannaah Bhatia : బుల్లి తెరపై తమన్నా..
సినిమాల్లో అవకాశాలు తగ్గాయని తమన్నా డీలా పడలేదు.. వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకుంటూ కొత్త ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతోంది..
- sekhar
- Published On : June 17, 2021 / 01:17 PM IST
Tamannaah Bhatia
Tamannaah Bhatia: మిల్కీబ్యూటీ తమన్నా క్రేజ్ సినిమాల్లో కొద్దిగా తగ్గిందనే చెప్పాలి. ఇది వరకు పెద్ద హీరోల సినిమాలంటే తమన్నా పేరు ఖచ్చితంగా పరిశీలనలో ఉండేది. ఐతే ఇప్పుడు ఆమెను పెద్ద హీరోల సరసన తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ఏదో గెస్ట్ రోల్స్, స్పెషల్ సాంగ్స్ మినహా స్టార్ హీరోల సిమిమాల కోసం ఆమెను అప్రోచ్ అవ్వడం తగ్గించేశారు చాలామంది దర్శక నిర్మాతలు.
సినిమాల్లో అవకాశాలు తగ్గాయని తమన్నా డీలా పడలేదు. వచ్చిన ఆఫర్లను అందిపుచ్చుకుంటూ కొత్త ప్రయత్నాలు చేస్తూ సక్సెస్ అవుతోంది.. అంతే కాకుండా ఓటీటీల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఓటీటీల్లో లేడీ ఓరియంట్ సినిమాలకు తమన్నా బెస్ట్ ఆప్షన్‌గా మారింది. ‘లెవెంత్ అవర్’, ‘ట్రూత్ తమన్నా’ వంటి వెబ్ సీరీస్‌లో లీడ్ రోల్ పోషించింది.
ఐతే ఇప్పుడీ మిల్కీ బ్యూటీ మరో ప్రయోగం చేయనుంది. తాను యాంకర్‌గా మారి బుల్లితెర అభిమానులకు దగ్గర కానుంది. తాజాగా జెమినీ ఛానల్ ఒక క్రేజీ రియాలిటీ షో ప్రారంభించబోతుంది. దానికి తమన్నా హోస్ట్‌గా చేయనుంది. ఈ షో ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యిందే. అంతేగాక ముప్ఫై సంవత్సరాల నుండి వివిధ దేశాల్లో విజయవంతంగా రన్ అవుతోంది. ఈ షో ని ఇండియాలో కూడా ‘మాస్టర్ చెఫ్’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఇది హిందీలో స్టార్ ప్లస్ ఛానల్లో ప్రసారమవుతుంది.
అయితే ఇప్పుడు ఈ ‘మాస్టర్ చెఫ్ ఇండియా’ తెలుగులో ప్రారంభం కాబోతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఆల్రెడీ పూర్తయినట్లు తెలుస్తుంది. ఐతే ఈ షో ను వచ్చే నెల నుంచి టెలికాస్ట్ చేయాలని భావిస్తున్నారు. చాలామంది హీరోయిన్లు ఇప్పటికే హోస్ట్‌గా మారారు.. ఇప్పుడు ఈ కోవలోకి తమన్నా చేరింది. చూడాలి మరి, ఈ మిల్కీ బ్యూటీ బుల్లితెరపై ఏ మాత్రం అలరిస్తుందనేది.
