×
Ad

అరటితో బట్టలు…మెడిసిన్స్ తయారీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ : రూ.400 కోట్ల ఖర్చుతో ప్రాజెక్టు

  • Published On : January 25, 2021 / 12:39 PM IST

Tamil Nadu gov banana plant, Cloth, drug : అరటి పండు.. తింటే ఆరోగ్యం మెండు..అని నిపుణులు చెబుతుంటారు. సామాన్యులకు కూడా అందుబాటు ధరలో దొరికే అరటిపండులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. అరటిపండు మూడు యాపిల్ పండ్లకు సమానం. అలాగే ఒకటిన్నర గుడ్లకు సమానం. అరటిపండుతో చాలా ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయి. పీచుపదార్ధాలు, ఐరన్ లాంటి ఖనిజాలు శరీరానికి పుష్కలంగా దొరికే మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే అరటి చెట్టు వల్ల కూడా చాలా ప్రయోజనాలున్నాయి. అరటిపండ్లే కాదు అరటి పువ్వులను కూడా కూరలుగా వండుకుంటారు. అరటి కాండంతో కూడా చాలా ఉపయోగాలున్నాయి.

అయితే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా అందించే అరటిపై తమిళనాడు ప్రభుత్వం దృష్టిపెట్టింది.వస్త్రాలు, ఔషధాల తయారు చేసే దిశగా తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి ఓ ప్రాజెక్టుకు రూ.400 కోట్లతో శ్రీకారం చుట్టింది. అరటి ఫైబర్(పీచు), కాండం నుంచి వస్త్రాలు, ఔషధాలను తయారు చేయటానికి అడుగులు వేస్తోంది. దీని కోసం తమిళనాడు ప్రభుత్వం 400 కోట్ల రూపాయల పరిశోధన ప్రాజెక్టును ఓ ప్రైవేటు సంస్థకు ఇచ్చింది. ఈ విషయాన్ని సీఎం పళనిస్వామి వెల్లడించారు.

జిల్లాలోని ప్రధాన అరటి సాగు ప్రాంతమైన మెట్టుపాలయంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ఈ విషయాన్ని తెలియజేశారు. ధోతీలు, చొక్కాలు తయారు చేయడంలో అరటి ఫైబర్ ఉపయోగం, ఔషధాల తయారీలో కాండం ప్రత్యేకత గురించి ఇస్రో డైరెక్టర్ మయిల్సామి అన్నాదురై వివరించారు.

ఈ ప్రాజెక్టు విజయవంతమైతే అరటిని సాగుచేసే వారి ఆదాయం రెట్టింపు అవుతుందని పళనిస్వామి అన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను ఏప్రిల్ ఆఖరులో లేదా మే ప్రారంభంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ఎన్నికల వేడి ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 6.26 కోట్ల ఓటర్లు ఉన్నారు.

కాగా.. పురుషుల కంటే మహిళల ఓటర్ల 10 లక్షలు ఎక్కువగా ఉండటం గమనించాల్సిన విషయం. తమిళనాడులో మొత్తం 6,26,74,446 కోట్ల ఓటర్లు ఉన్నారు. మహిళలు 3,18,28,727 కోట్ల మంది ఉండగా, పురుషులు 3,08,38,473 మంది ఉన్నారు. ఇతరులు 7,246 మంది ఉన్నారు.