CM Stalin: కోవిడ్ కమాండ్ సెంటర్లో ఆకస్మిక తనిఖీ.. బాధితులతో మాట్లాడిన సీఎం!

తమిళనాడు నూతన సీఎం ఎంకే స్టాలిన్ కరోనా కట్టడి మీద కఠిన చర్యలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు వ్యవధిలోనే రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్న సీఎం రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల, ఆసుపత్రులలో సౌకర్యాలపై దృష్టి పెట్టారు.

CM Stalin: తమిళనాడు నూతన సీఎం ఎంకే స్టాలిన్ కరోనా కట్టడి మీద కఠిన చర్యలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు వ్యవధిలోనే రాష్ట్రంలో లాక్ డౌన్ అమలుకు నిర్ణయం తీసుకున్న సీఎం రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల, ఆసుపత్రులలో సౌకర్యాలపై దృష్టి పెట్టారు. కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఈక్రమంలోనే శుక్రవారం రాత్రి సమయంలో సీఎం స్టాలిన్ కోవిడ్ కమాండ్ సెంటర్ ను ఆకస్మిక తనిఖీ చేశారు.

Cm Stalin1

రాష్ట్రంలో కొవిడ్​ రోగులకు ఆసుపత్రుల వివరాలు, అందులో బెడ్​ల ఏర్పాటు, ఆక్సిజన్ పంపిణీపై కమాండ్​ సెంటర్​ పనిచేస్తున్న తీరును సీఎం స్వయంగా పరిశీలించారు. ముందుగా కమాండ్ సెంటర్ సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుంటున్న స్టాలిన్ అనంతరం సెంటర్ కు ఫోన్ చేసిన ఓ బాధితుడితో స్వయంగా మాట్లాడి ఏ ఆసుపత్రిలో బెడ్ దొరుకుతుందో చెప్పారు. ఇలాంటి విపత్కర పరిస్థితులలోనే మరింత బాధ్యతగా వ్యవహరించాలని.. ప్రభుత్వ తీరుతోనే బాధితులకు సగం ఆందోళన తగ్గించాలని సీఎం అధికారులకు సూచించారు.

 

Cm Stalin2

Read: Svims Hospital: ఆక్సిజన్ సంక్షోభం అంచున స్విమ్స్.. కోత విధించిన కాంట్రాక్టర్!

ట్రెండింగ్ వార్తలు