Tamilnadu man assassinated his friend wild boar : తమిళనాడులో ఇద్దరు స్నేహితులు కలిసి వేటకెళ్లారు. నాటు తుపాకులతో వేటకెళ్లిన ఘటనలో ఓ స్నేహితుడు మరో స్నేహితుడ్ని అడవిపంది అనుకుని పొరబడి తుపాకీతో కాల్చేసిన విషాద ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. వేటకు వెళ్లి అడవిపంది అనుకుని స్నేహితున్ని కాల్చేసినన ఘటన స్థానికంగా సంచలన కలిగించింది.
వివరాల్లోకి వెళితే..అంజెట్టి సమీపంలోని తొట్టి మంజువల్లిపురం మంజు గ్రామానికి చెందిన 40 ఏళ్ల పసుప్ప అతని స్నేహితుడు నాగరాజుతో కలిసి గత గురువారం (జనవరి 11,2021) రాత్రి అక్కడికి సమీపంలోని అటవీ ప్రాంతానికి నాటు తుపాకీలతో వేటకు వెళ్లారు. అక్కడ అడవిపందులను వేటాడేందుకు చెరో దిక్కుకు వెళ్లారు. అలా అర్థరాత్రి సమయంలో కూడా అడవిపందుల కోసం వెతుకుతూనే ఉన్నారు. ఎక్కడ ఏ పొదలో కదిలికలు వచ్చినా అది అడవిపంది ఏమో అనుకునేవారు. అడవిపందుల కోసం కాపు కాసుకుని కూర్చున్నారు.
అలా అర్ధరాత్రి నాగరాజు వెళ్లిన ప్రాంతంలో శబ్దం రావడంతో అది అడవిపంది అనుకుని తుపాకీతో కాల్చాడు. ఆ తరువాత కాల్చిన చోటికి వెళ్లి చూడగా..తుపాకీ తూట దూసుకెళ్లి పసుప్ప నెత్తుటి మడుగులో గిలగిలా కొట్టుకుంటు పడి ఉన్నాడు. దీంతో నాగరాజు భయపడిపోయాడు. ఏం చేయాలో తెలియక గాబరాపడిపోయాడు. వెంటనే ఈ హాస్పిటల్ లో తరలిందామంటే అర్థరాత్రి పైగా అడవి..చుట్టూ కారు చీకటి. దీంతో ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉండగానే పసుప్ప మృతి చెందాడు.
దీంతో నాగరాజు భయంతో అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం మరునాడు శుక్రవారం ఉదయం అటవీ ప్రాంతానికి వెళ్లిన కొందరు పసుప్ప చనిపోయి ఉండటాన్ని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నాగరాజు, పసుప్ప కలిసి అడవిలోకి నాటు తుపాకులతో వెళ్లినట్లుగా గుర్తించిన పోలీసులు నాగరాజు కోసం గాలిస్తున్నారు.