Tapsee Pannu comments on Karan johar
Tapsee : బాలీవుడ్ అగ్ర దర్శకనిర్మాత కరణ్‌జోహార్ నిర్వహించే ‘కాఫీ విత్ కరణ్’ షో ఎంత పాపులరో అందరికి తెలిసిందే. బాలీవుడ్ స్టార్లు సైతం తమ సినిమాలని అక్కడ ప్రమోట్ చేయాలి అనుకుంటారు. అయితే ఈ షోకి వచ్చే గెస్టులని సినిమాల గురించే కాక పర్సనల్ లైఫ్, సెక్స్ లైఫ్ గురించి కూడా ప్రశ్నలు అడుగుతాడు కరణ్.
కరణ్ అడిగే ఈ ప్రశ్నలకి కొంతమంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కానీ కరణ్ అవేమి పట్టించుకోడు. ఇటీవల మొదలైన కాఫీ విత్ కరణ్ షో కొత్త సీజన్ లో కూడా ఈ ప్రశ్నల డోసు మరింత పెంచాడు. ప్రతి ఎపిసోడ్ లోనూ వచ్చిన గెస్టుల సెక్స్ లైఫ్ గురించి అడుగుతున్నాడు. తాజాగా హీరోయిన్ తాప్సీ కరణ్ కి కౌంటర్ వేసింది.
Divi Vadthya : ఎదపై పచ్చబొట్టు చూపిస్తూ దివి సోకులు
ప్రస్తుతం తాప్సీ తన కొత్త సినిమా ‘దొబారా’ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఓ విలేఖరి తాప్సీని.. మీకు కరణ్‌జోహార్ షో నుంచి ఎందుకు ఆహ్వానం రాలేదు, మీరు ఆ షోలో పాల్గొనరా? అని అడిగాడు. దీనికి తాప్సీ సమాధానమిస్తూ.. నా సెక్స్ లైఫ్ బహుశా అంత ఆసక్తికరంగా లేదేమో, అంత బాగోలేదేమో, అందుకే ‘కాఫీ విత్ కరణ్’ షో నుంచి ఆహ్వానం రాలేదేమో అని చెప్పింది. దీంతో తాప్సీ కరణ్‌జోహార్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది అని బాలీవుడ్ మీడియా అంటుంది. మరి దీనిపై కరణ్ స్పందిస్తాడేమో చూడాలి.