Bjp President Jk
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం కోసం కృషి చేస్తోన్న కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలు సఫలం కాకుండా చేసేందుకు పాకిస్థాన్ కుట్ర పన్నిందని బీజేపీ ఆరోపించింది. జమ్మూకశ్మీర్‌లో హిందువులపై కొన్ని రోజులుగా వరుసగా జరుగుతోన్న దాడులపై జమ్మూకశ్మీర్ అధ్యక్షుడు రవీందర్ రైనా స్పందించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం వల్ల జమ్మూకశ్మీర్‌లో ఎన్నో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ తీవ్ర నిరాశకు గురై జమ్మూకశ్మీర్‌లో దాడులకు కుట్రలు పన్నుతోందని అన్నారు.
Arvind Kejriwal: మా అందరినీ అరెస్టు చేసేయండి: కేజ్రీవాల్
అక్కడి ప్రజల్లో భయాన్ని నింపేలా ఉగ్రవాద చర్యలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ, ఆర్మీ, పీవోకేలోని ఉగ్రవాదులు కలిసి ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ కుట్రకు వారు ‘ఆపరేషన్ రెడ్ వేవ్’ అనే పేరు పెట్టుకున్నారని ఆయన చెప్పారు. జమ్మూకశ్మీర్ ప్రజలకు పాకిస్థానే అతి పెద్ద శత్రువు అని ఆయన వ్యాఖ్యానించారు.
Sonia Gandhi: కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా నిర్ధారణ
కశ్మీర్ లోయలో అఫ్గానిస్థాన్ వంటి పరిస్థితులు తీసుకురావాలని పాక్ భావిస్తోందని ఆయన అన్నారు. పాకిస్థాన్ చర్యలను భారత భద్రతా బలగాలు తిప్పికొడుతున్నాయని ఆయన చెప్పారు. కుల్గాంలో బ్యాంకు మేనేజర్ విజయ్ కుమార్‌ను చంపడాన్ని పాకిస్థాన్, దాని ప్రేరేపిత ఉగ్రవాదుల పిరికి పంద చర్యగా ఆయన అభివర్ణించారు.