bjp new parliamentary board announced..key post for k laxman
bjp new parliamentary board announced : బీజేపీ కీలక కమిటీలను పునర్నిర్మించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. పార్టీ కొత్త పార్లమెంటరీ బోర్డు, కేంద్ర ఎన్నికల కమిటీని బుధవారం (8,2022) ప్రకటించారు. అయితే ఇందులో పలువురు కొత్తవారికి అవకాశం లభించింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో మొత్తం 11 మందికి అవకాశం కల్పించగా, కేంద్ర ఎన్నిక కమిటీలో 15 మంది కి అవకాశం కల్పించారు. ఈరెండింటిలోను కే లక్ష్మణ్ కు స్థానం కల్పించింది బీజేపీ అధిష్టానం.
15మందితో బీజేపీ ఎన్నికల కమిటీని నియమించగా.. కమిటీ చైర్మన్ గా జగత్ ప్రకాశ్ నడ్డాను నియమించగా సభ్యులుగా నరేంద్ర మోడీ, అమిత్ షా, కర్ణాటక నుంచి యడియూరప్పా, రాజ్ నాథ్ సింగ్, నర్బానంద్ సోనోవాల్, ఇక్బాల్ సింగ్ లాల్పురా, సుధా యాదవ్, సత్యనారాయణ జటియా, బిపాల్ సంతోష్,భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, ఓం మాథుర్, వనతి శ్రీనివాస్,బీఎల్ సంతోష్ లతో పాటు తెలంగాణ నుంచి కే. లక్ష్మణ కు స్థానం కల్పించారు.